Home ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు: కొండలు కోనలు దాటి.. ఏజెన్సీ ప్రజల గుమ్మం – Andhra Waves

చంద్రబాబు నాయుడు: కొండలు కోనలు దాటి.. ఏజెన్సీ ప్రజల గుమ్మం – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


చంద్రబాబు నాయుడు: పురాణ కాలంలో రాక్షసులు.. రాముడి పరివారం యుద్ధం చేసినప్పుడు.. ఆ పోరాటంలో లక్ష్మణుడు మూర్చ పోతాడు. ఆ సమయంలో హనుమంతుడు లక్ష్మణుడిని బతికించడానికి సంజీవని పర్వతాన్ని తీసుకొస్తాడు. గాలిలో తన చేతిలో సంజీవని పర్వతాన్ని అమాంతం లేపుకొని వచ్చి.. లక్ష్మణుడికి పునర్జన్మ అందిస్తాడు. పురాణ కాలంలో దేవతామూర్తుల శక్తులు ఉంటాయి. ఆశక్తుల ద్వారా వారు అసాధ్యమైన పనిని సైతం సుసాధ్యం చేస్తారు. ఇప్పటి కాలంలో అది సాధ్యమా.. పట్టుదల ఉంటే.. చిత్తశుద్ధి ఉంటే.. ఓటు వేసి. […]

చంద్రబాబు నాయుడు: పురాణ కాలంలో రాక్షసులు.. రాముడి పరివారం యుద్ధం చేసినప్పుడు.. ఆ పోరాటంలో లక్ష్మణుడు మూర్చ పోతాడు. ఆ సమయంలో హనుమంతుడు లక్ష్మణుడిని బతికించడానికి సంజీవని పర్వతాన్ని తీసుకొస్తాడు. గాలిలో తన చేతిలో సంజీవని పర్వతాన్ని అమాంతం లేపుకొని వచ్చి.. లక్ష్మణుడికి పునర్జన్మ అందిస్తాడు.

పురాణ కాలంలో దేవతామూర్తుల శక్తులు ఉంటాయి. ఆశక్తుల ద్వారా వారు అసాధ్యమైన పనిని సైతం సుసాధ్యం చేస్తారు. ఇప్పటి కాలంలో అది సాధ్యమా.. పట్టుదల ఉంటే.. చిత్తశుద్ధి ఉంటే.. ఓటు వేసి గెలిపించిన ప్రజల మీద ప్రేమ ఉంటే కచ్చితంగా సాధ్యమే అని నిరూపిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.

ఇన్నాళ్లపాటు వైద్య సేవలు అందక.. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన మన్యం ప్రజలకు సంజీవని లాంటి చంద్రబాబు ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. వాస్తవానికి దేశంలో ఇటువంటి సేవలు అందించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చిరస్థాయిగా నిలిచిపోతుంది. అల్లూరు జిల్లాలో డ్రోన్ ద్వారా వైద్య సేవలు అందిస్తూ.. కొండకోనల్లో గిరిజనులకు సరికొత్త భరోసా కల్పిస్తోంది కూటమి ప్రభుత్వం.

అడవులు.. ఎత్తైన కొండలు.. సరైన నియమాలు లేని మారుమూల గ్రామాలు.. అత్యవసర వైద్యం అందాలంటే ఆసుపత్రికి దూరం కావాలి.. అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజనులకు ఆసుపత్రికి చేరుకోవడమే ఒక పెద్ద సవాల్. గర్భిణులు.. అత్యవసర చికిత్స అవసరమైన రోగుల కష్టాలు వర్ణనాతీతం. ఇలాంటి పరిస్థితుల్లో సాంకేతికత కొత్త ఆశలు నింపుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలకు డ్రోన్ల ద్వారా మందులు.. రక్తనము నాలుగు.. వ్యాక్సిన్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన ఈ కార్యక్రమం గిరిజన ప్రాంతాల వైద్య సేవలకు కొత్త దారిని చూపుతోంది…

అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ బౌగోళిక పరిస్థితుల కారణంగా వైద్య సేవలు అందించడం ఎప్పటినుంచో ఇబ్బందికరంగా ఉంది. దట్టమైన అడవులు.. కొండ మార్గాలు.. రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల రక్త నమూనాలను ప్రయోగశాలలకు చేర్చడం.. అత్యవసరమైన మందులను గ్రామాలకు పంపించడం ఆలస్యమైన సందర్భాలు చాలా ఉన్నాయి. అందువల్లే ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. రహదారి మార్గంలో ఎక్కువ సమయం పట్టే ప్రాంతాలకు డ్రోన్ మార్గా ల ద్వారా వైద్య సామగ్రిని వేగంగా తరలిస్తున్నారు. దీనివల్ల రోగులపై ప్రయాణ భారం తగ్గుతోంది. వైద్య పరీక్షల ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది.

2026లో మొదలైన డ్రోన్ వైద్య రవాణా వ్యవస్థలో 4 డ్రోన్లు సేవలు అందాయి. సెప్టెంబర్ 2026 న ఈ డ్రోన్లు 1800 పైగా ట్రిప్పులు పూర్తి చేసి.. 71 వేలకు పైగా ఉన్నాయి.

  • 2200కు పైగా వైద్య నమోనాలను రవాణా చేశాయి
  • 596 సికిల్ సెల్ పరీక్షల నమూనాలను తరలించాయి.
  • 9,000 కు పైగా వైద్య పరీక్షలకు సహకారం అందించారు
  • 24,500 మందికి రోగులకు ప్రయోజనం కలిగించింది.

డ్రోన్ సేవలను మరింత విస్తరించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరకు నియోజకవర్గంలోని గన్నెల గ్రామంలో సంజీవని ఆరోగ్య ప్రాజెక్టును ఆగస్టు 29న ప్రారంభించారు. గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఆర్కే నగర్ గ్రామ వైద్య పరీక్షల నివేదికలు.. వ్యాక్సిన్లు.. మందులను.. డ్రోన్ల ద్వారా తరలించే సేవలకు ఆయన శ్రీకారం చుట్టారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird