Home ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు: స్థానిక సంస్థల ఎన్నికలు.. – Andhra Waves

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు: స్థానిక సంస్థల ఎన్నికలు.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు: కుక్కతోక వంకర అనే సామెత మీరు ఎప్పుడైనా విన్నారా.. పోనీ మీకు ఎప్పుడైనా నిజజీవితంలో అనుభవంలోకి వచ్చిందా.. అలా వచ్చిన తర్వాత మీ రీతి ఎలా మారింది.. మీ పద్ధతి ఎలా మార్చుకున్నారు.. మీ సంగతి ఏంటో మాకు తెలియదు గానీ.. వైసిపి నేతలు మాత్రం తమ రీతి మార్చుకోవడం లేదు. తమ తీరును సరిదిద్దుకోవడం లేదు. ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో వైసిపి మొదటి నుంచి […]

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు: కుక్కతోక వంకర అనే సామెత మీరు ఎప్పుడైనా విన్నారా.. పోనీ మీకు ఎప్పుడైనా నిజజీవితంలో అనుభవంలోకి వచ్చిందా.. అలా వచ్చిన తర్వాత మీ రీతి ఎలా మారింది.. మీ పద్ధతి ఎలా మారింది.. మీ సంగతి ఏంటో మాకు తెలియదు గానీ.. వైసిపి నేతలు మాత్రం తమ రీతి మార్చుకోవడం లేదు. తమ తీరును సరిదిద్దుకోవడం లేదు.

ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో వైసిపి మొదటి నుంచి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తామని ముందుకు వెళ్తుంటే.. దానికి అడుగడుగునా బ్రేకులు వేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనిని.. చంద్రబాబు ఉండటంతో తట్టుకోలేక విషం కక్కుతోంది. చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అయినా ఆ పార్టీకి అనుకూల తీర్పు రాలేదు. పైగా సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయలకు వైసీపీ నేతల తల బొప్పి కట్టింది.

రాష్ట్రంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు లోకల్ బాడీ ఎలక్షన్లు.. వార్డుల పునర్విభజన ను పూర్తిగా ఆపేయాలని వైసిపి పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం తిప్పి పంపింది. ఒకరకంగా వైసిపి నేతల పిటిషన్ ను చెత్త బుట్ట పాలు చేసింది. ఎన్నికలను ఏదో విధంగా అడ్డుకోవాలని ప్రయత్నించిన వైసీపీ నేతలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

కొద్దిరోజులుగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించాలని వైసిపి చేయని ప్రయత్నం లేదు. న్యాయపరమైన చిక్కులను సృష్టిస్తోంది. వరుసగా ఇబ్బందులను కలగజేస్తోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకూడదని వైసిపి మొదటి నుంచి గట్టిగా పోరాడుతోంది. వాస్తవానికి ఇటువంటి ఎన్నికల నిర్వహణను ఆలస్యం చేయడానికి సరిపోవని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

చివరికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో వైసిపి ఆశలు మొత్తం గోదారిలో కలిసిపోయాయి. చివరికి వైసీపీ నేతలు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని మాత్రమే ఆశ్రయించాల్సి ఉంటుంది. అక్కడ అనుకూలమైన తీర్పు రావాలంటే ఖచ్చితంగా అమెరికా ప్రెసిడెంట్ సహకారం కోసం టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.. ఎన్నికలను ఏదో విధంగా ఆపితే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి. కారణంగా డెవలప్మెంట్ నిలిచిపోతుంది. దీంతో ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. దీనిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని వైసిపి చేయని ప్రయత్నం లేదు. కానీ దేవుడు ఒకడున్నాడు. ఆయన రాసిన స్క్రిప్ట్ మరో విధంగా ఉంది. అందుకే వైసీపీకి దిమ్మ తిరిగిపోయింది. అమరావతిలో ఎదురుదెబ్బ.. హస్తినాపురంలో ఎదురుదెబ్బ.. పాపం జగన్ తాడేపల్లి ప్యాలస్ లో వినిపించే మ్యూజిక్ ఆర్తనాదానికి దగ్గరగా ఉన్నట్లు టిడిపి నేతలు కామెంట్లు చేస్తున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird