నారా భువనేశ్వరి: ఎంత సంపాదించాం అనేది కాదు.. ఎంతమంది పేదలకు ఉపయోగపడ్డం.. వారి కష్టాలలో ఏ స్థాయిలో అండదండగా నిలిచాం.. దీనిని ఆచరణలో పెట్టడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రారంభంలో చంద్రబాబు ఆధ్వర్యంలో సాగింది. అనేక రకాల సేవా కార్యక్రమాలను ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించారు. ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎటువంటి ఆపద లేదా ప్రకృతి విపత్తు చోటు చేసుకున్నా సరే ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యులు అక్కడికి వెళ్తారు. మేము సైతం అన్నట్టుగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో
ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రస్తుతం నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తోంది. నారా భువనేశ్వరికి సమాజ సేవ మెండుగా ఉంటుంది. హెరిటేజ్ కంపెనీ ద్వారా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అనేక రకాల సేవా కార్యక్రమాలను భువనేశ్వరి నిర్వహించారు. రైతుల దగ్గర్నుంచి మొదలుపెడితే మహిళల వరకు ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు ఆమె ఎన్నో రకాల పథకాలను అమలు చేశారు. ఇప్పటికీ అమలు చేస్తూనే ఉన్నారు. ఒక ప్రైవేటు పాల సంస్థ రైతుల సంక్షేమం కోరి ఈ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం దాదాపు ప్రపంచంలోనే ప్రథమం.
తల సేమియా బాధితులకు అండగా..విజయవాడలో బ్లడ్ బ్యాంక్
ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న నారా భువనేశ్వరి. ఇప్పుడు తల సేమియా బాధితులకు అండగా నిలుస్తున్నారు. గతంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి.. విరాళాలు సేకరించారు. తల సేమియా బాధితుల కోసం వాటిని వినియోగించారు. ఇప్పుడు తల సేమియా బాధితులకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయబోతున్నారు. అక్టోబర్ 16న ఇది ప్రారంభం కాబోతోంది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రస్తుతం బ్లడ్ బ్యాంక్ నిర్వహించారు..
క్రమం తప్పకుండా రక్తమార్పిడి
తల సేమియా అనేది ప్రాణాంతకమైన రక్తసంబంధిత వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారికి రక్తమార్పిడి చేయవలసి ఉంటుంది. అలాంటి చిన్నారుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా నిలుస్తోంది.. ఎన్టీఆర్ మెమో ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా రక్త మార్పిడి చేయించుకునే బాధితులకు ఉచితంగా వైద్య సేవలు.. రక్తమార్పిడి సేవలు.. అవసరమైన మందులను అందజేస్తోంది. వారికి జీవితం మీద భరోసా కల్పిస్తోంది. తల సేమియా అనేది వంశపారంపర్యంగా వచ్చే రక్తసంబంధిత వ్యాధి. ఈ వ్యాధితో బాధపడే కొంతమంది రోగులకు జీవితాంతం క్రమం తప్పకుండా రక్తమార్పిడి చేయవలసి ఉంటుంది. దీంతో బాధిత కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం పడుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రత్యేకంగా తల సేమియా బాధితుల కోసం వైద్య సేవలను అందిస్తోంది. హైదరాబాదులోని బంజారాహిల్స్లో ఉన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ ద్వారా తల సేమియా బాధితులకు ఉచిత రక్త మార్పిడి.. అవసరమైన మందుల పంపిణీ వంటి సేవలను అందిస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్.
ప్రత్యేక తలసేమియా కేర్ సెంటర్
తల సేమియా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అనే లక్ష్యంతో 2019 జూన్ 14న హైదరాబాదులోని ఎన్టీఆర్ మెమో రియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకులో ప్రత్యేక తలసేమియా కేర్ సెంటర్ను నారా భువనేశ్వరి అందించారు. ఈ కేంద్రం ద్వారా బాధిత చిన్నారులకు వైద్య సహాయం అందించండి అనంతరం ఈ సేవలను మరింత విస్తరించే దిశగా ట్రస్ట్ పలు కార్యక్రమాలను చేపట్టారు. తల సేమియా బాధితులకు అవసరమైన రక్తం.. మందులు అందించడంతోపాటు.. వారి కుటుంబాలకు సహకారం అందించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.తల సేమియా బాధితుల కోసం సమగ్రమైన వైద్య సంరక్షణ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 25 పడకల ప్రత్యేక తలసేమియా కేర్ సెంటర్ ఏర్పాటు చేసింది. 2025లో ప్రారంభించిన ఈ వైద్య చికిత్స.. క్రమం తప్పకుండా రక్త మార్పిడి.. అవసరమైన మందుల పంపిణీ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.
స్వచ్ఛంద దాతల సహకారంతో రక్త సేకరణ
తల సేమియా బాధితుల కోసం రక్తం నిరంతరం ఉండటం అత్యంత కీలకం. మరో ఎన్టీఆర్ ట్రస్ట్ స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోంది. విద్యాసంస్థలు.. ఐటీ కంపెనీలు.. వివిధ సంస్థలు.. స్వచ్ఛంద దాతల సహకారంతో సేకరణ కార్యక్రమాలను చేపడుతోంది. హైదరాబాద్ నగరంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న ట్రస్ట్ రక్త కేంద్రాలు అవసరమైన వారికి సురక్షితమైన రక్తాన్ని అందిస్తున్నాయి. తల సేమియా బాధితులతో పాటు.. అత్యవసరమైన వైద్య చికిత్స అవసరమైన వారికి కూడా ఈ సేవలు ఉపయోగపడుతున్నాయి.వైద్య సేవలతో పాటు.. తల సేమియాపై ప్రజల్లో అవగాహన పెంచడానికి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మే 10న హైదరాబాదులోని నెక్లెస్ రోడ్ జలవిహార్ వద్ద తల సేమియా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా తల సేమియా నివారణలో ముందస్తు పరీక్షలు. ఈ కార్యక్రమంలో సుమారు 81,610 మంది ఉన్నారు. యువతను.. ప్రజల రక్తదానం.. వ్యాధి నివారణ.. బాధితులకు సహకారం అందించే కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం.
బాధితులకు వైద్య సహాయం
తల సేమియా చికిత్స దీర్ఘకాలం కొనసాగాల్సి ఉంటుంది. ఇది బాధ్యత కుటుంబాల మీద ఆర్థికంగా ఒత్తిడి పెంచుతుంది. ఈ నేపథ్యంలో ఉచిత రక్త మార్పిడి.. మందుల పంపిణీ.. ప్రత్యేక వైద్య సేవ ద్వారా వారి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ కృషి చేస్తోంది. వ్యాధి గురించి అవగాహన కల్పించడం.. అవసరమైన చికిత్స అందించడం.. రక్తదాతలను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను సమన్వయం చేస్తూ బాధిత చిన్నారులకు అండగా నిలవడం ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో ముఖ్యమైన భాగంగా కొనసాగుతోంది. ప్రత్యేక కేర్ సెంటర్లో ఏర్పాటు నుండి మొదలుపెడితే రక్తదాన శిబిరాలు.. అవగాహన కార్యక్రమాల వరకు వివిధ కార్యక్రమాల ద్వారా బాధితులకు వైద్య సహాయం ట్రస్ట్ పనిచేస్తుంది.
విజయవాడ : స్టెల్లా కళాశాలకు నారా భువనేశ్వరి – ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్, బ్లడ్ బ్యాంక్ ప్రారంభం – ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నారా భువనేశ్వరి @ManagingTrustee
#NTRTట్రస్ట్ https://t.co/882YcTqEMf
— (@dmuppavarapu) అక్టోబర్ 16, 2026