సంగీత ప్రపంచంలో ఎవరూ అందుకోలేని ఎత్తుకు ఎదిగిన లెజెండరీ సింగర్ ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్ చుట్టూ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఒకటే చర్చ నడుస్తోంది. ఒకప్పుడు తానే స్వయంగా ప్రాణం పెట్టి చేయాలనుకున్న ఆ క్యారెక్టర్ చేయలేకపోవడం ఇప్పటికీ తనను బాధపెడుతుందని బాలీవుడ్ స్టార్ విద్యా బాలన్ ఓపెన్గా చెప్పారు. అసలు విషయం ఏంటంటే.. ఇప్పుడు అదే పాత్రను నేషనల్ క్రష్ రష్మిక మందన్న చేస్త హాట్ హాట్ హాట్ టాపిక్ ఒక్కసారిగా న్యూస్గా మారిపోయింది.
నిజానికి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాత్ర విద్యా బాలన్ 2014లోనే గట్టిగా ట్రై చేశారు. ఆ క్యారెక్టర్ కోసం అచ్చం సుబ్బులక్ష్మిలా తయారై ప్రత్యేకంగా ఫొటోషూట్ కూడా చేయించుకున్నారు. అప్పట్లో ఆ ఫొటోలు బయటకు రాగానే సోషల్ మీడియాలో ఏ రేంజ్లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో విద్యా బాలన్ మాట్లాడుతూ.. ఆ లుక్ చూసిన తర్వాత తనకు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో పెద్ద ఆఫర్లు వచ్చాయి. అయితే సరిగ్గా సినిమా మొదలయ్యే టైంకి కోర్టు గొడవలు వచ్చి ఆ చిత్రం ఆగిపోయింది.
“ఆ పాత్రను తెరపై చేయలేకపోయానే అన్న వెలితి ఇప్పటికీ నన్ను వెంటాడుతోంది” అంటూ తన మనసులోని బాధను ఆమె బయటపెట్టింది. అప్పట్లో విద్యా బాలన్ చేజారిన ఆ డ్రీమ్ రోల్లో ఇప్పుడు రష్మిక మందన్న కనిపించబోతున్నారు. విద్యా బాలన్ లాంటి అద్భుతమైన నటి కూడా ఆ క్యారెక్టర్ మిస్సయినందుకు పదేళ్లుగా కుమిలిపోతున్నారంటే, ఆ పాత్ర ఎంత పవర్ ఫుల్ అనేది అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక సంగీతానికి వన్నె తెచ్చిన ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక ఎలా మెప్పిస్తుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు.
