
చిరంజీవి ఫ్యాన్స్ మంచి ‘కాక’ మీద ఉన్నారు. మరి వన్ ఇయర్ అవుతుంది బాస్ నుంచి మూవీ వచ్చి. అందుకే ‘కాక’ ఎలా ఉండబోతుంది. బాస్ ఈ సారి ఎలాంటి మెస్మరైజ్ చేయబోతున్నారనే అతృతతో వాళ్లంతా ఉన్నారు. జనవరి 13 2027 కి కౌంట్ డౌన్ పెరగడం కూడా ఒక కారణం. ఈ ‘కాక’ కి సంబంధించిన ప్రతి న్యూస్ ని క్షుణ్ణంగా గమనిస్తూనే ఉన్నారు. అందులో నైజాం బిజినెస్ డీల్. మరి ఆ డీటెయిల్స్ మనం కూడా చూద్దాం.
నైజాం హక్కులు సొంతం చేసుకున్న ఏషియన్ సురేశ్!
చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాపై మొదటి నుంచి మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి.
తాజాగా ఈ సినిమా నైజాం థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. ఈ ప్రదర్శన చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీనితో తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి సందర్భంగా ఈ సంస్థ భారీ స్థాయిలో సినిమాను విడుదల చేయనుంది.
సంక్రాంతి రేసులో మెగాస్టార్!
ఈ సినిమాకి సంబంధించి విడుదల తేదీ విషయంలో గతంలో చాలా రకాల ప్రచారాలు జరిగాయి. సినిమా వాయిదా పడుతుందనే వార్తలు కూడా వినిపించాయి. అయితే మేకర్స్ మాత్రం జనవరి 13, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడాన్ని మరోసారి వివరించారు.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. మిగిలిన చిత్రీకరణను పూర్తి చేసి ప్రమోషన్లను భారీ స్థాయిలో నిర్వహించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.
ఇది కూడా చదవండి: చిరంజీవి, బాలకృష్ణ మల్టీస్టారర్‌కి కథ రెడీ.. బోయపాటి ముందుగా బాలయ్యని ఒప్పించారా?
చిరంజీవి డ్యూయల్ రోల్.. భారీ అంచనాలు!
ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్న క్యారెక్టర్స్ లో కనిపించనున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది. అనశ్వర రాజన్ పాత్రలో నటిస్తుండగా, నివేదా పేతురాజ్, అనురాగ్ కశ్యప్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా థమన్ మ్యూజిక్. ముఖ్యంగా చిరంజీవి, బాబీ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందనే ఆశాభావంతో మెగా అభిమానులు ఉన్నారు.
బాక్సాఫీస్ దగ్గర ఎంత ప్రభావం చూపుతుంది?
సంక్రాంతి సీజన్ తెలుగు సినిమాలకు అత్యంత కీలకం. ఈ సమయంలో పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే థియేటర్ల దగ్గర సందడి మామూలుగా ఉండదు. ఇప్పుడు చిరంజీవి కాకా కూడా సంక్రాంతి బరిలో ఉండటంతో ఈ సినిమా బిజినెస్‌పై ఆసక్తి పెరిగింది.
.webp)
ముఖ్యంగా నైజాం వంటి కీలక మార్కెట్‌లో ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ రంగంలోకి దిగడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. మరి చిరంజీవి తన మాస్ ఇమేజ్‌తో సంక్రాంతి బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో షేక్ చేస్తారో చూడాలి.
మొత్తానికి ‘కాకా’ నైజాం హక్కుల విషయంలో క్లారిటీ రావడంతో సినిమా మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి సినిమా ఫస్ట్ సింగిల్, ట్రైలర్‌తో పాటు తదుపరి ప్రమోషనల్ అప్‌డేట్స్‌పై ఉంది.
మీకు నచ్చవచ్చు
సీతమ్మ లుక్‌పై ట్రోలింగ్: సాయి పల్లవి రిప్లై తెలిస్తే షాక్ అవుతారు!
బయటపడిన గుట్టు: మిగిలిన హీరోలు ఈ ఇద్దర్ని చూసి నేర్చుకుంటారా!
[Kaka, Nizam Rights, Asian Suresh Entertainment, Tollywood]
