Home సినిమా IPL 2027 కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్‌..? – Andhra Waves

IPL 2027 కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్‌..? – Andhra Waves

by andhra andhrawave
0 comments
IPL 2027 కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్‌..?


ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) కొత్త కెప్టెన్ ఎవరనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అజింక్య రహానె అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో కొత్త సారథిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేకేఆర్ తదుపరి కెప్టెన్‌గా యువ బ్యాటర్ రింకూ సింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.

జియోస్టార్ ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్.. ప్రస్తుతం కోల్‌కతా జట్టులో కెప్టెన్సీకి ఎక్కువ ప్రత్యామ్నాయాలు లేవని పేర్కొన్నాడు. అందుబాటులో ఉన్న జాబితాలో రింకూ సింగ్ అత్యుత్తమ ఎంపిక అని తెలిపాడు. ఒకవేళ వేలంలో కెప్టెన్సీ సామర్థ్యం ఉన్న ఆటగాడిని కొనుగోలు చేయాలనుకుంటే వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్‌ను పరిశీలించాలని సూచించారు. అయితే కేకేఆర్ యాజమాన్యం వ్యవహరించే తీరు చూస్తుంటే రింకూకే నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంచనా వేశాడు. రహానె ప్లేస్‌లో యువ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీకి ఓపెనర్‌గా అవకాశం కల్పించడానికి పఠాన్ తెలిపాడు. గాయం నుంచి కోలుకున్న హర్షిత్ రాణా పునరాగమనంతో బౌలింగ్ విభాగం మరింత బలోపేతం అవుతుందని అంచనా వేసింది. సమర్థవంతమైన నాయకుడు కొనుగోలు గత సీజన్‌తో కోల్‌కతా మెరుగైన ప్రదర్శనను ఆశాభావం వ్యక్తం చేశాడు.

రింకూకే ఆకాశ్ చోప్రా మద్దతు..

గతంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కూడా రింకూ సింగ్ కెప్టెన్సీకి మద్దతు తెలిపాడు. గత సీజన్‌లోనే అతడిని వైస్ కెప్టెన్‌గా నియమించిన గుర్తుచేశాడు. ప్రత్యామ్నాయంగా అనుభవజ్ఞుడైన సునీల్ నరైన్‌ను కూడా పరిశీలించాలని సూచించాడు. మరోవైపు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను రూ.25.20 కోట్లకు అట్టిపెట్టుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అతడిని విడుదల చేసి వేలంలో తక్కువ ధరకే తిరిగి సొంతం చేసుకునే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డాడు. కాగా, 2018 నుంచి కోల్‌కతా జట్టులో కొనసాగుతున్న రింకూ సింగ్ అసాధారణ బ్యాటింగ్‌తో ఫినిషర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమిస్తూ మ్యాచ్‌లను ముగించగల సామర్థ్యం అతనికి సొంతం. డిసెంబర్ 16న ఐపీఎల్ వేలం జరగనుంది. ఈ వేలంలో కోల్‌కతా జట్టు రూ.41.65 కోట్లతో బరిలోకి దిగనుంది. మరి మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ జట్టుకు రింకూ సింగ్ సారథ్యం చేస్తారాడో చూడాలి. ఫ్రాంచైజీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

రచయిత అవతార్

సయ్యద్ నాగ్ పాషా

నా పేరు సయ్యద్‌ నాగ్‌పాషా. iDreamPost.comలో చీఫ్ సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. 2023 నుంచి ఐడ్రీమ్‌తో నా ప్రయాణం మొదలైంది. ఇక్కడ డెస్క్ వర్క్‌తో పాటు రాజకీయ, జాతీయ, అంతర్జాతీయ, హెల్త్, లైఫ్ స్టైల్, క్రికెట్‌కు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. అలాగే పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్ కంటెంట్ కూడా రాస్తుంటాను. జర్నలిజం వృతిలోకి 2018లో వచ్చాను. నాకు జర్నలిజంలో 9 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. 2017లో సాక్షి జర్నలిజం స్కూల్ నుంచి ఈ జర్నీ మొదలైంది. ఆ తర్వాత సాక్షి వెబ్‌సైట్‌, ఖమ్మం యూనిట్‌ ఆఫీస్‌, సుమన్‌ టీవీ, టీవీ9 డిజిటల్‌లో సేవలు అందించాను.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird