Home Latest News మీకు దనవంతులు కావాలని ఉందా..అయితే మార్వాడీల నియమాలు తెలుసుకోండి..! | ధనవంతులు కావాలా | మార్వాడీలు అనుసరించే ఈ మనీ రూల్స్ తెలుసుకోండి – Andhra Waves

మీకు దనవంతులు కావాలని ఉందా..అయితే మార్వాడీల నియమాలు తెలుసుకోండి..! | ధనవంతులు కావాలా | మార్వాడీలు అనుసరించే ఈ మనీ రూల్స్ తెలుసుకోండి – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


జీవితాంతం ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేసినా చాలామంది ఆర్థికంగా ఎదగలేకపోతుంటారు. కానీ కొందరు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనైనా తరతరాలుగా అత్యంత ధనవంతులుగా నిలదొక్కుకుంటూ ఉంటారు. దీనికి అసలు కారణం వారి దగ్గర ఉన్న డబ్బు కాదు, వారి ఆలోచన విధానం లేదా మైండ్ సెట్. భారతదేశంలో వ్యాపారాలకు మార్వాడీలు పెట్టింది పేరు. మార్వాడీలు అవలంబించే కొన్ని ప్రత్యేకమైన ఆర్థిక సూత్రాలను తెలుసుకోవడం ద్వారా సామాన్యులు కూడా తమ సంపదను వృద్ధి చేసుకోవచ్చు. ఆ ఆర్థిక సూత్రాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే..

డబ్బును ప్రేమించడం కంటే దానితో పని చేయడం ముఖ్యం..

చాలామందికి జీతం రాగానే కొత్త వస్తువులు కొనడం, రెస్టారెంట్లు , ట్రిప్స్ అంటూ ఖర్చు చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. కానీ మార్వాడీలు ఎప్పుడూ ఈ డబ్బు నాకు ఇంకో రూపంలో ఎంత సంపాదించి పెడుతుంది అనే కోణంలో ఆలోచిస్తారు. కేవలం పొదుపు చేయడం వల్ల డబ్బు నిలబడుతుంది కానీ ఇన్వెస్ట్‌మెంట్లు మాత్రమే డబ్బును రెట్టింపు చేస్తాయి. ప్రతి రూపాయిని ఒక ఉద్యోగిగా భావించి తగిన ప్రతిఫలం రాబట్టడంపై దృష్టి పెట్టాలి.

ప్రతి రూపాయికి స్పష్టమైన లెక్క ఉండాలి..

నెలవారీ ఖర్చులపై సరైన అవగాహన లేకపోవడం వల్లనే చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. లెక్క తెలియని సంపద ఎప్పుడూ నిలవదు. మార్వాడీలు తాము ఖర్చు చేస్తే ప్రతి పైసాను రాసుకుంటారు. రాత్రి పడుకునే ముందు ఆ రోజు ఎంత ఖర్చు చేశాం, ఎందుకు చేశాం అని పరిశీలించుకోవడం ద్వారా అనవసరపు ఖర్చులకు అడ్డుకట్ట వేయవచ్చు.

జీవనశైలి మార్చుకోవడం కాదు.. ఆస్తులు పెంచుకోవాలి..

సమాజంలో హోదా కోసం లేదా పక్కవాళ్ళను చూసి ఐఫోన్లు, ఖరీదైన బైకులు, కార్లు కొంటూ ఈఎంఐలు , లోన్లతో జీవితాన్ని అప్పులమయం చేస్తారు. కానీ పెరిగిన ఆదాయం వెంటనే జీవనశైలిని మార్చుకోకూడదని, ముందుగా ఆస్తులను పెంచుకోవాలని మార్వాడీలు నమ్ముతారు. ధనవంతులుగా కనిపించడం కాకుండా నిజంగా ధనవంతులు కావడానికి ఖర్చు చేయాలి.

ఇది కూడా చదవండి చేతికి డబ్బు రాగానే ఈ పనులు చేయండి.. లేకపోతే బాధపడతారు..!

వాతావరణం..

చిన్నప్పటి నుంచే పిల్లలకు వ్యాపారం, డబ్బు నిర్వహణ గురించి మాట్లాడే వాతావరణం మార్వాడీ కుటుంబాల్లో ఉంటుంది. దీనివల్ల మంచి అవకాశాలు దక్కుతాయి. జీవితంలో ఎదగాలంటే మంచి ఆలోచనలు ఉన్నవారితో కలవడం, మంచి పుస్తకాలు చదవడం , అనుభవజ్ఞులైన మార్గదర్శకుల సలహాలు తీసుకోవడం ఎంతో అవసరం.

రిస్క్..

రిస్క్ తీసుకోవడం అంటే గుడ్డిగా డబ్బు పెట్టేయడం కాదు, అన్ని కోణాల్లో ఆలోచించి చిన్న మొత్తంతో ప్రారంభించడం. ఈరోజు ఇన్‌ఫ్లేషన్ వల్ల డబ్బు విలువ పడిపోతున్న తరుణంలో ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడమే పెద్ద రిస్క్ అవుతుంది. సరిగ్గా నేర్చుకొని, సరైన నిర్ణయాలు తీసుకోవాలి.

ఆస్తి కాదు.. జ్ఞానం ముఖ్యం..

కేవలం బడిలో, పుస్తకాల చదువులతో సరిపెట్టకుండా చిన్న వయసులోనే వ్యాపార మెలకువలు, కస్టమర్లతో మాట్లాడే విధానం, లాభనష్టాల బేరీజు వేయడం నేర్పిస్తారు. దీనివల్ల యుక్తవయసు వచ్చేసరికి వారికి అద్భుతమైన అనుభవం సొంతమవుతుంది.

రేపటి తరం కోసం..

రేపటి కోసం ఆశపడకుండా, సుదీర్ఘకాల లాభాల లక్ష్యాలతో ప్రణాళికలు రచిస్తారు. ఒక రైతు విత్తనం నాటి వెంటనే ఫలితం ఆశించకుండా ఎలా రోజూ నీరు పోసి సంరక్షిస్తాడో, సంపద కూడా అలాగే సహనంతో కూడుకున్న ప్రక్రియ.

ఎప్పటికీ చేయకూడని పొరపాట్లు..

పెరిగిన వెంటనే విలాసవంతమైన ఆదాయాలు పెంచడం, కేవలం ఒకే ఆదాయ వనరుపై ఆధారపడకుండా వివిధ మార్గాల్లో సంపాదన సృష్టించడం, భావోద్వేగాలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా లాజిక్ గా రీసెర్చ్ ఆధారంగా పెట్టుబడులు పెట్టడం వంటి నియమాలు వారిని ఎప్పటికీ అగ్రస్థానంలో ఉంచుతాయి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టడం మన చేతుల్లో లేకపోయినా, సరైన ఆర్థిక నిర్ణయాలతో జీవితాన్ని మార్చుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది.

*రూపశ్రీ.

మీకు నచ్చవచ్చు రిలేషన్‌షిప్‌లో పర్సనల్ స్పేస్..భాగస్వామి ఒంటరిగా గడపాలని కోరుకోవడానికి అసలు కారణాలు..!
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా..అసలు కారణాలు ఇవే..!

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird