భారత టూవీలర్ మార్కెట్లో టీవీఎస్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. 2020లో బ్రిటన్‌కు చెందిన నార్టన్ మోటార్‌సైకిల్స్‌ను కొనుగోలు చేసిన టీవీఎస్.. ఈ బ్రాండ్‌ను తిరిగి బలోపేతం చేస్తోంది. ఇప్పుడు నార్టన్‌కు చెందిన అట్లాస్ జీటీ, మ్యాంక్స్ ఆర్ మోటార్ సైకిళ్లకు భారత్‌లో పేటెంట్ దాఖలైనట్లు సమాచారం. దీంతో ఈ రెండు ప్రీమియం బైక్‌లు 2027లో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కంపెనీ ఇంకా అధికారికంగా విడుదల తేదీలను ప్రకటించలేదు.
అట్లాస్ జీటీ.. టూరింగ్‌కు ప్రత్యేకం
నార్టన్ అట్లాస్ జీటీ ఒక మిడిల్‌వెయిట్ అడ్వెంచర్ టూరింగ్ బైక్. సాధారణ అట్లాస్ మోడల్‌తో తాజా ఇది రోడ్లపై ప్రయాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వెర్షన్. ఇందులో ముందు, వెనుక అల్లాయ్ వీల్స్ ఉంటాయి. సాధారణ అట్లాస్‌లో వైర్-స్పోక్ వీల్స్ అందిస్తున్నారు. ఈ బైక్‌లో 585సీసీ లిక్విడ్ కూల్డ్, DOHC ప్యారలాల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 9,300 ఆర్పీఎం వద్ద 69 బీహెచ్పీ పవర్, 7,300 ఆర్పీఎం వద్ద 57.5 ఎన్ఎం టార్క్ ఇస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, రెండు వైపులా పనిచేసే క్విక్‌షిఫ్టర్ ఇందులో ఉన్నాయి.
ఫీచర్లు కూడా అదిరిపోయేలా..
అట్లాస్ జీటీలో 8 టీఎఫ్టీ డిస్ప్లే ఉంటుంది. ఇందులో నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఐదు రైడింగ్ మోడ్లు, వీలీ కంట్రోల్, స్లైడ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. బైక్‌లో 15.4 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, పూర్తిగా సర్దుబాటు చేసుకునే KYB సస్పెన్షన్ అందించారు. బ్రేకింగ్ కోసం ముందు 310 మిల్లీమీటర్ల డ్యూయల్ డిస్క్‌లు, వెనుక 270 మిల్లీమీటర్ల డిస్క్ ఉన్నాయి. అడ్వెంచర్ రైడింగ్‌తో పాటు లాంగ్ టూరింగ్ చేసే వారికి ఈ మోడల్ ఉపయోగపడేలా రూపొందించారు.
మ్యాంక్స్ ఆర్.. 1200సీసీ V4 ఇంజిన్
నార్టన్ మ్యాంక్స్ ఆర్ కంపెనీ ఫ్లాగ్షిప్ సూపర్‌బైక్. ఇందులో 1,200సీసీ, 72 డిగ్రీల V4 లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజన్ 11,500 ఆర్పీఎం వద్ద 206 బీహెచ్పీ పవర్, 9,00 ఆర్పీఎం వద్ద 130 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు రెండు వైపులా పనిచేసే క్విక్షిప్టర్ కూడా ఉంది. ఈ బైక్‌లో 8 ట్రాక్ టీఎఫ్టీ స్క్రీన్, ఆరు యాక్సిస్ IMU,షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, స్లైడ్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్ వంటి అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. బ్రేకింగ్ కోసం బ్రెంబో హైప్యూర్ కాలిపర్లు అందించారు.
మ్యాంక్స్ ఆర్‌లో నాలుగు వేరియంట్లు
నార్టన్ మ్యాంక్స్ ఆర్‌ను స్టాండర్డ్, అపెక్స్, సిగ్నేచర్, ఫస్ట్ ఎడిషన్ అనే నాలుగు వేరియంట్లలో అందించారు. వీటిలో సస్పెన్షన్, వీల్స్, బాడీ మెటీరియల్ ఆధారంగా మార్పులు ఉంటాయి. స్టాండర్డ్ మోడల్లో మాన్యువల్‌గా సర్దుబాటు చేసుకునే మార్జోక్కీ సస్పెన్షన్, అల్లాయ్ వీల్స్ ఉంటాయి. అపెక్స్ వెర్షన్లో ఎలక్ట్రానిక్ సెమీ యాక్టివ్ సస్పెన్షన్, ఫోర్జ్డ్ అల్లాయ్ వీల్స్ అందించారు. సిగ్నేచర్, ఫస్ట్ ఎడిషన్ మోడళ్లలో కార్బన్ ఫైబర్ భాగాలు ఉంటాయి. మొదటి ఎడిషన్ ప్రపంచవ్యాప్తంగా కేవలం 150 యూనిట్లకే పరిమితం చేయబడింది. బ్రిటన్‌లో మ్యాంక్స్ ఆర్ ప్రారంభ ధర 20,250 పౌండ్లు. భారత మార్కెట్లోకి వస్తే ధర, ఫీచర్లలో మార్పులు ఉండొచ్చు.
భారత్‌లో ఎప్పుడు విడుదలైంది?
నార్త్ బైక్స్‌కు భారత్‌లో పేటెంట్ దాఖలవడం మార్కెట్లోకి రాకకు సంబంధించిన సంకేతంగా ఉంది. ఆటోకార్ ఇండియా తాజా నివేదిక ప్రకారం.. నార్టన్ భారత్‌లో తన కార్యకలాపాలను 2027 జనవరి-మార్చి మధ్య ప్రారంభించే అవకాశం ఉంది. మొదట అట్లాస్ మోడల్, ఆ తర్వాత మ్యాంక్స్ను తీసుకురావాల్సిన సమాచారం. అయితే భారత్‌లో అట్లాస్ జీటీ, మ్యాంక్స్ ఆర్ మోడల్ విడుదల తేదీలు ఇంకా ఖరారు కాలేదు.
The post టీవీఎస్ నుంచి రెండు పవర్ఫుల్ బైక్‌లు appeared first on iDreamPost.
