Home Latest News విడదల రజనీ ఇలాకాలో వైసీపీకి బిగ్ షాక్: దేశం గూటికి వైసీపీ మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి.! | చిలకలూరిపేట వైసీపీకి భారీ షాక్ | వైసీపీ మున్సిపల్ చైర్ పర్సన్ | అభ్యర్థి | షేక్ కరీమున్ | టీడీపీలో చేరండి | ప్రత్తిపాటి పుల్లారావు | చిలకలూరిపేట వైసీపీ | ఏపీ రాజకీయాలు – Andhra Waves

విడదల రజనీ ఇలాకాలో వైసీపీకి బిగ్ షాక్: దేశం గూటికి వైసీపీ మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి.! | చిలకలూరిపేట వైసీపీకి భారీ షాక్ | వైసీపీ మున్సిపల్ చైర్ పర్సన్ | అభ్యర్థి | షేక్ కరీమున్ | టీడీపీలో చేరండి | ప్రత్తిపాటి పుల్లారావు | చిలకలూరిపేట వైసీపీ | ఏపీ రాజకీయాలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


పల్నాడు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. స్థానిక ఎన్నికల వేళ.. ఉన్న వైసీపీ మున్సిపల్ చైర్మన్ రేసులో కీలక నాయకురాలు షేక్ కరీమున్ పార్టీకి రాజీనామా చేసి.. తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీ ఇలాకాలోనే వైసీపీకి ఈ పరిణామంతో కోలుకోలేని దెబ్బ తగిలినట్లైంది. చిలకలూరి పేట ఎమ్మెల్యే , మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో షేక్ కరీమున్ తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కరీమున్ చేరికతో చిలకలూరిపేట పట్టణంలో తెలుగుదేశం కూటమి మరింద బలపడిపోయింది. రానున్న రోజులలో ఆమెకు తెలుగుదేశంలో ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

కాగా తాను చిలకలూరిపేట పట్టణ సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తెలుగుదేశంలో చేరినట్లు షేక్ కరీమున్ చెప్పారు. . చిలకలూరిపేట పట్టణాభివృద్ధి ప్రత్తిపాటి పుల్లారావు నాయకత్వంతోనే సాధ్యమవుతుందన్న ఇమె.. నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న మౌలిక వసతుల కల్పన, వినూత్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితురాలై తెలుగుసంస్థ గూటికి చేరినట్లు చెప్పారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు.

అలాగే స్థానిక ఎన్నికలలో విజయానికి శ్రమిస్తానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల సమరంలో చిలకలూరి పేట మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఉన్న కీలక నాయకురాలు తెలుగుదేశం గూటికి చేరడంతో వైసీపీ డీలా పడింది. తాజా పరిణామాలతో చిలకలూరిపేట మున్సిపల్ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. ఎన్నికల రేసులో ఉన్న కీలక అభ్యర్థి పార్టీ మారడం వల్ల కూటమి బలం పెరుగుతుందని స్థానిక నేతలు.

[Big Shock To YCP Chilakaluripet, YCP Municipal Chairperson, Candidate,Sheik Karimun, Join TDP,  Prathipati Pulla Rao, Chilakaluripet YCP, AP Politics, Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird