కన్నడ చిత్ర పరిశ్రమ భవిష్యత్‌ను మార్చేసిన సినిమా అంటే ‘కేజీఎఫ్’ మాత్రమే గుర్తుకు వస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. దేశం మొత్తం కన్నడ చిత్ర సీమ వైపు తిరిగి చూసేలా చేసింది. కన్నడనాట ఎన్నో రికార్డులను సృష్టించిన ఈ సినిమా రికార్డులను ఓ చిన్న సినిమా తుడిచేసింది.
”ప్రేమద ఊరాలి” అనే చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
కేవలం రూ.2 నుంచి 3 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన నెల రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర లిఖించింది. ఈ చిన్న సినిమా కర్ణాటక బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు సైతం విస్మయానికి గురవుతున్నాయి. ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ లైఫ్‌టైమ్ కలెక్షన్లను కూడా ‘ప్రేమద ఊరలి’ వెనక్కి నెట్టడం విశేషం. కర్ణాటక రాష్ట్రంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఈ సినిమా ప్రస్తుతం నాలుగో స్థానానికి చేరుకుని సంచలనం సృష్టించింది.
కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పడతారని ప్రేమతో ఊరాలి మరోసారి నిరూపించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ, మౌత్ టాక్‌తో రోజురోజుకూ వసూళ్లను పెంచుకుంటూ థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. తెలుగులో ఈ సినిమా ‘ప్రేమనే ఊరిలో’ పేరుతో డబ్ అయి రిలీజ్ అయింది. అయితే, తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ సినిమా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.

