ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టులో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రిషబ్త్ జట్టును వీడడంతో కొత్త కెప్టెన్ ఎంపికపై ఆసక్తి. ఈ వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్‌కు లక్నో పగ్గాలు అప్పగించే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి కారణం ఆ జట్టు యువ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ చేసిన వ్యాఖ్యలే. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా దిగ్వేష్ రాఠీ ఓ అభిమానితో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లక్నో సూపర్ జెయింట్స్ తర్వాత కెప్టెన్ ఎవరని ఆ అభిమాని ప్రశ్నించారు.. నికోలస్ పూరన్ పేరును దిగ్వేశ్ ప్రస్తావించినట్లు సమాచారం. దీంతో వచ్చే సీజన్లో పూరన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించవచ్చనే చర్చ మొదలైంది. అయితే, దిగ్వేష్ రాఠీ చేసిన కామెంట్స్ ను అధికారిక ప్రకటనగా భావించలేం. లక్నో ఫ్రాంచైజీ ఇప్పటివరకు తమ కొత్త కెప్టెన్ పేరును ప్రకటించలేదు. రాఠీ సమాధానం కేవలం ఒక సూచన మాత్రమేననే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
రిషబ్ పంత్ ట్రేడ్ డీల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి వెళ్లడంతో లక్నో జట్టులో కెప్టెన్సీ స్థానం ఖాళీ అయింది. కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్న ఈ ట్రేడ్ వ్యవహారం ఐపీఎల్ 2027కు ముందు లక్నోలో కెప్టెన్సీ మార్పుకు దారితీసింది. పంత్ గతంలో జట్టుకు కెప్టెన్సీ చేయగా రానున్న సీజన్లో ఢిల్లీ జట్టుకు ట్రేడ్ అయ్యాడు. ఇప్పుడు పంత్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం ఇంటస్టింగ్ గా మారింది.
లక్నో జట్టులో కెప్టెన్సీకి అర్హులైన అనుభవజ్ఞులు చాలామందే ఉన్నారు. నికోలస్ పూరన్‌తో పాటు మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్ పేర్లు కూడా పరిశీలనలో ఉండే అవకాశం ఉంది. ట్రేడ్ ద్వారా జట్టులోకి వచ్చిన సామ్ కరన్ కు కూడా కెప్టెన్సీ అనుభవం ఉంది. మరి వీరిలో లక్నో యాజమాన్యం ఎవరికి పగ్గాలు అప్పగిస్తుంది? దిగ్వేష్ రాఠీ సూచించినట్లుగా పూరన్‌కే కెప్టెన్సీ దక్కుతుందా? అన్నది తెలియాలంటే ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

