తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులకు, అలాగే న్యాయస్థానాల్లో ఉద్యోగ అవకాశాలు కోరుకునే వారికి శుభవార్త. రాష్ట్రంలో పలు కోర్టుల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 136 కొత్త పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఆయా కోర్టుల్లో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది.
రాష్ట్రంలోని న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు కేసుల విచారణ, పరిపాలనా కార్యకలాపాలు వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటైన రెండు కోర్టులకు కలిపి 56 పోస్టులను అందించనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడీషియల్ కోర్టు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌తో పాటు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి కోర్టుకు ఈ పోస్టులు కేటాయించబడ్డాయి.
మరోవైపు ఇప్పటికే నాలుగు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుల్లోనూ సిబ్బంది నియామకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కోర్టుల్లో వివిధ విభాగాలకు సంబంధించి మరో 80 పోస్టులను మంజూరు చేయనున్నారు.
ఇలా కోర్టులు, ఇప్పటికే ఉన్న కోర్టులు కలిపి మొత్తం 13 కొత్త సిగ్నల్స్ పోస్టులకు మంత్రివర్గం గ్రీన్ ఇచ్చింది. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్, అర్హతలు, దరఖాస్తు తేదీల వివరాలు వెల్లడైన తర్వాత అభ్యర్థులకు మరింత స్పష్టత రానుంది.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనా కీలక నిర్ణయం
ఇదే సమయంలో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది కొరతను తగ్గించి పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అలాగే వివిధ ప్రభుత్వ శాఖలకు భూములను బదిలీ చేసేలా కూడా క్యాబినెట్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, న్యాయస్థానాల్లో కొత్త పోస్టుల అంశాలు నిరుద్యోగుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
