పూర్తి స్థాయిలో బిజీ అయిపోయిన తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్ మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పరిపాలనా బాధ్యత తీరిక లేకుండా గడుపుతున్న ఆయన, త్వరలోనే షూటింగ్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
సాధారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రచారాలకు సంబంధించిన యాడ్స్ చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిస్తారు. కానీ ఈసారి సీఎం విజయ్ నటించబోయే ప్రభుత్వ యాడ్ ఫిల్మ్‌ను కనీవినీ ఎరుగని రీతిలో భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ యాడ్ ఫిల్మ్‌ను తెరకెక్కించే బాధ్యతను స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ చేతుల్లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను అత్యంత రిచ్‌గా, స్టైలిష్‌గా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఏర్పాట్లు ఉన్నాయి.
ఈ స్పెషల్ యాడ్ షూట్ కోసం సీఎం విజయ్ రెండు రోజుల పాటు కాల్షీట్లు కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ యాడ్ షూట్ ఇప్పుడే స్టార్ట్ కావడం లేదట. అతి త్వరలో డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఈ షూటింగ్ పూర్తి చేయనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత విజయ్ మళ్లీ కెమెరా ముందుకొచ్చి మేకప్ వేసుకోబోతుండటం, అందులోనూ స్టార్ డైరెక్టర్ కాంబోలో భారీ బడ్జెట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కావడంతో ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ బయటికి రాలేదు.
The post షూటింగ్‌కు రెడీ అవుతున్న సీఎం విజయ్? iDreamPostలో మొదట కనిపించారు.
