Home Latest News ఐపీఎల్ నిధుల గోల్ మాల్ నిందితుడు లలిత్ మోడీ: ఇక యూకే సిటిజన్.! | లలిత్ మోడీ | ఆక్స్‌ఫర్డ్ యూనియన్ ప్రకటన | IPL వ్యవస్థాపకుడు | UK పౌరసత్వం – Andhra Waves

ఐపీఎల్ నిధుల గోల్ మాల్ నిందితుడు లలిత్ మోడీ: ఇక యూకే సిటిజన్.! | లలిత్ మోడీ | ఆక్స్‌ఫర్డ్ యూనియన్ ప్రకటన | IPL వ్యవస్థాపకుడు | UK పౌరసత్వం – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తాను భారత పౌరుడిని కాదనీ, ఇక బ్రిటిష్ సిటిజన్ ను అని ప్రకటించారు. తాను అధికారికంగా బ్రిటన్ పౌరసత్వాన్ని పొందినట్లు. ఆక్స్‌ఫర్డ్ యూనియన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన లలిత్ మోడీ, తాను గత 16 ఏళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్‌లోనే ఆవిష్కరణనీ, ఇప్పుడు తనకు బ్రిటిష్ పౌరసత్వం లభించడం గర్వకారణమని చెప్పారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 15న తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య బ్రిటన్‌సత్వ వేడుకను ఘనంగా నిర్వహించినట్లు లలిత్ మోడీ చెప్పారు. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III జన్మదిన వేడుకల సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సందర్భంగా అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. గాడ్ సేవ్ దికింగ్ అంటూ తన పౌరసత్వ పక్కన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

బ్రిటన్ తనను ఎంతో ఆదరించిందని, అక్కడి సంప్రదాయాలు, విలువలు, సంస్థలు, ప్రజల జీవన విధానం తనకు ఎంతగానో నచ్చాయన్న గత 16 ఏళ్లుగా యునైటెడ్ కింగ్ డమ్ తన ఆవాసంగా మారింది. ఇప్పుడు చట్టబద్ధంగా బ్రిటన్ పౌరుడిగా గుర్తింపు పొందడం ఒక అదృష్టంగానే కాకుండా ఎంతో బాధ్యతతో కూడుకున్న పవిత్రమైన విషయంగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఆర్థిక నేరగాడు లలిత్ మోడీపై చర్యలు అటకెక్కినట్లేనా?

ఈ కొత్త అధ్యాయంలోకి ఉత్సాహంగా అడుగుపెడుతున్నానన్న లలిత్ మోడీ.. ఇక తన శేష జీవితమంతా బ్రిటన్ పౌరుడిగానే కొనసాగుతున్నానని చెప్పారు. కాగా, గతంలో ఐపీఎల్ టోర్నమెంట్ నిర్వహణ సమయంలో ఆర్థిక లావాదేవీలు, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు ఎదుర్కొన్న లలిత్ మోదీ, 2010లో భారత్‌ను వీడి బ్రిటన్‌కు ప్రవాసం వెళ్లిన సంగతి తెలిసిందే.

అప్పట్నుంచి ఆయన లండన్ కేంద్రంగానే లలిత్ మోడీ భారత దర్యాప్తు సంస్థల విచారణలు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి తరుణంలో ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం లభించడం రాజకీయ, క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 16 ఏళ్లుగా ప్రవాస జీవితం గడిపిన లలిత్ మోదీ, ఇప్పుడు బ్రిటన్ దేశ పౌరసత్వాన్ని అధికారికంగా స్వీకరించడం ద్వారా ఇండియాకు తిరిగి రాననీ, దర్యాప్తు సంస్థలకు సహకరించే ఉద్దేశం లేదనీ విస్పష్టంగా ప్రకటించారు.

మీకు నచ్చవచ్చు: లలిత్ మోడీ షాకింగ్ కామెంట్స్: క్రికెట్‌లో రోజుకు రూ. 40వేల కోట్ల బెట్టింగ్!

అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. .10 మంది అరెస్టు

[Lalit Modi,  Oxford Union announcement, IPL founder,UK citizenship, TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird