Home Latest News సోనియా గాంధీ బిలాంగింగ్ పుస్తకం: వ్యక్తిగతమే కాదు.. రాజకీయ అభివ్యక్తీకరణ కూడా.! | సోనియా గాంధీ | చెందిన పుస్తకం | రాజకీయాలు | ఆత్మకథ – Andhra Waves

సోనియా గాంధీ బిలాంగింగ్ పుస్తకం: వ్యక్తిగతమే కాదు.. రాజకీయ అభివ్యక్తీకరణ కూడా.! | సోనియా గాంధీ | చెందిన పుస్తకం | రాజకీయాలు | ఆత్మకథ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


సమకాలీన రాజకీయాలలో సోనియాగాంధీ ఆత్మకథ బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకం పెను దుమారం రేపిందనడంలో సందేహం లేదు. ఈ పుస్తకం కేవలం ఆమె ఆత్మకథగానే కాకుండా, దేశ రాజకీయాలలో కీలకమైన మలుపులు, కుటుంబ బంధాలు, అంతర్గత సంఘర్షణలను సైతం బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మకథ పుస్తకంలోని అంశాలను, అందులో ప్రస్తావించిన వివాదం, అప్పటి రాజకీయాల ప్రభావంపై ఎడతెగని చర్చ జరుగుతోంది.

పుస్తకంలోని చరిత్ర , వ్యక్తిగత జీవితం ఒకదానికొకటి ముడిపడి ఉండటం కూడా ఆ పుస్తకంపై పెను చర్చకు, భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం కావడానికి కారణం అయ్యింది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి, భారత రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరిన సోనియా ప్రస్థానం అంతా విభేదాలు, వివాదాలు, విషాదాల సమాహారంగా సాగింది. అందులో సందేహం లేదు. అవే విషయాలు ఆమె తన ఆత్మకథలో పొందుపరిచారు. అయితే.. వాటిని పొందుపరిచే ఆమె కొన్ని అంశాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించారనీ, కొన్నింటిని అంతే ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారన్న చర్చ జోరుగా సాగుతోంది.

అలాంటి వాటిలో ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ, అలాగే రాజీవ్ హయాంలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలపై సోనియాగాంధీ ప్రస్తావించిన బీజేపీ సమా కాంగ్రేస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తమను తాము తటస్థంగా చెప్పుకునే వ్యక్తులు, మేధావు కూడా ఆమె ఆత్మకథలో ప్రస్తావించిన అంశాలు నిష్పక్షపాతంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పోతే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు, నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు కూడా సోనియా తన ఆత్మకథలో ప్రస్తావించారు. ఇదే ఆమె రాజకీయ ప్రత్యర్థులకు విమర్శించడానికి అవకాశం ఇచ్చింది.

ఇక పోతే ఇప్పుడు ఆమె తన ఆత్మకథ ప్రచురణ వెనుక ఉన్న ఉద్దేశాలు, వ్యూహాలపై కూడా పలు రకాలుగా విమర్శలు, వ్యాఖ్యలు, కొండొకచో ప్రశంసలూ వ్యక్తమౌతున్నాయి. రాజకీయ ఆత్మకథ పేర పుస్తకాలు ప్రచురించడం సోనియాతోనే మొదలు కాలేదు కానీ, సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్ ఒకే సమయంలో వివాదాలకు నిలయంగానూ, విశేష పాఠకాదరణకు కారణం ఆమె నేపథ్యం, ​​ఆమె కుటుంబ నేపథ్యం, ​​ఆమె కుటుంబంలో సంభవించిన విషాదాలే కారణం అని చెప్పవచ్చు. అయితే ఆమె తన పుస్తకంలో ప్రస్తవించిన కొన్ని అంశాల విషయంలో సంయమనం పాటించకపోవడమే అసలు సమస్య అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఒత్తిడితో ఓకే చెప్పా: ఆ తరువాత నో అన్నా.. ప్రధాని పదవిపై సోనియాగాంధీ.!

ముఖ్యంగా సోనియా ఎమర్జెన్సీ, రాజీవ్ హయాంలో తీసుకున్న కొన్ని వివాద నిర్ణయాలను సమర్ధించేలా నెపాన్ని పార్టీకే చెందిన కొందరు సీనియర్లపై నెట్టివేయడం ఏకకాలంలో కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా, రాజకీయ ప్రత్యర్థులకు విమర్శించడానికి ఒక అవకాశంగా మారిందంటున్నారు. అందుకే సోనియా గాంధీ పుస్తకం బిలాంగింగ్ పై కాంగ్రెస్ లోనే కొన్ని వర్గాల నుంచి భిన్న స్పందన వ్యక్తమౌతోంది.

మొత్తంగా సోనియా బిలాంగింగ్: ఏ జెర్నీ ఆఫ్ లవ్ ప్రత్యర్థులకు విమర్శనాస్త్రాలను అందిస్తూనే, వ్యక్తిగతంగా ఆ కుటుంబం పడిన వేదనను కళ్లకు కట్టి నెహ్రూ కుటుంబ త్యాగాలను మరిచిపోతున్నతరానికి గుర్తు చేస్తున్న పరిస్థితి పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది.

మీకు నచ్చవచ్చు: సోనియా ఆత్మకథలో అసలు నిజాలెన్ని.. వైట్‌వాషింగ్ అంటూ బీజేపీ విమర్శలు.!

రాజీవ్ గాంధీకు నో.. రాహుల్‌కు ఓకేనా? సోనియా ఆత్మకథలో ఆసక్తికర విషయాలు.!

[Sonia Gandhi,  Belongingbook,  Politics, autobiography, TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird