Home సినిమా పేటీఎంకు ఆర్బీఐ గుడ్ న్యూస్! – iDreamPost – Andhra Waves

పేటీఎంకు ఆర్బీఐ గుడ్ న్యూస్! – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
పేటీఎంకు ఆర్బీఐ గుడ్ న్యూస్! - iDreamPost


పేటీఎం అవార్డుకు గుడ్ న్యూస్. గతంలో నిలిచిపోయిన పేటీఎం వాలెట్ సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిజిటల్ వాలెట్ సేవలను తిరిగి ప్రారంభించేందుకు పేటీఎం అనుబంధ సంస్థకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక అనుమతి ఇచ్చింది. నవంబర్ 13న పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్‌కు ఆర్బీఐ ప్రాథమిక ఆమోదం. అయితే ఈ అనుమతితో వెంటనే వాలెట్ సేవలు ప్రారంభం కావాలి. తుది అనుమతి కూడా పొందాల్సి ఉంటుంది.

అసలు విషయం ఏంటంటే..పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ లిమిటెడ్ కు ఆర్బీఐ ప్రాథమిక అనుమతి ఇచ్చింది.దీంతో ప్రీపెయిడ్ పేమెంట్స్ కింద డిజిటల్ వాలెట్లు, ఇతర ప్రీపెయిడ్ చెల్లింపులకు మార్గం సుగమమైంది.

వాలెట్ సేవలు ఎందుకు నిలిచిపోయాయి అంటే…పేటీఎం వాలెట్ సేవలు గతంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అందించేవారు. అయితే నిబంధనల ఉల్లంఘన, KYC సంబంధిత సమస్యలు, ఇతర నియంత్రణ లోపాల కారణంగా ఆర్బీఐ 2024 జనవరి 31న కీలక ఆంక్షలు విధించింది.

2024 ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలు, వాలెట్లు, ఫాస్ట్ ట్యాగ్ తదితర సేవల్లో కొత్త డిపాజిట్లు, టాప్ అప్‌లను స్వీకరించడంపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి.2026 ఏప్రిల్ 24న పేటీఎం పేమెంట్ బ్యాంక్ బ్యాంకింగ్ లైసెన్స్‌ను కూడా ఆర్బీఐ రద్దు చేసింది.

ఇప్పుడు పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా వాలెట్ సేవలను తిరిగి తీసుకొచ్చేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం పేటీఎం వాలెట్ సేవలు పునఃప్రారంభమైనట్లు కాదు. కేవలం ప్రాథమిక అనుమతి మాత్రమే లభించింది. కాబట్టి వినియోగదారులు వాలెట్ సేవలు తిరిగి ప్రారంభమయ్యే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird