ఓటీటీలో కొత్త సినిమాల కోసం ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన మూవీ వచ్చింది. ప్రేమ, యాక్షన్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన తమిళ సినిమా ‘అన్బిల్ అవన్’ డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. అశోక్ సెల్వన్, ప్రీతి ముఖుందన్ జంటగా నటించిన ఈ సినిమా గురించి ఓ లుక్ వేసేయండి..
ఈ సినిమా కథ విషయానికొస్తే.. సూర్య (అశోక్ సెల్వన్), ఇయల్ (ప్రీతి ముఖుందన్) ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. తన భార్య కోరికను నెరవేర్చేందుకు ఓ హిల్ స్టేషన్లో అందమైన ఇంటిని కొనుగోలు చేస్తాడు సూర్య. అక్కడే పాతకాలపు హోమ్‌స్టే ప్రారంభించాలని ప్లాన్ చేస్తారు.
అయితే కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత వారి జీవితాల్లో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. వింత అనుభవాలు, ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయి. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? ఈ సమస్యల నుంచి ఆ జంట ఎలా బయటపడింది? అనేదే సినిమా కథ.
‘అన్బిల్ అవన్’ నవంబర్ 13 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది. థియేటర్లలో అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా సుమారు ఆరు వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. పైగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. ప్రేమకథలతో పాటు సస్పెన్స్, యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఛాయస్.
మరిన్ని ఓటిటి అప్డేట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
