Home సినిమా IND vs NZ: తృటిలో తప్పిన ప్రమాదం.. నొప్పితో విలవిలలాడిన శ్రేయస్ అయ్యర్! – Andhra Waves

IND vs NZ: తృటిలో తప్పిన ప్రమాదం.. నొప్పితో విలవిలలాడిన శ్రేయస్ అయ్యర్! – Andhra Waves

by andhra andhrawave
0 comments
IND vs NZ: తృటిలో తప్పిన ప్రమాదం.. నొప్పితో విలవిలలాడిన శ్రేయస్ అయ్యర్!


ఈ సందర్భంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు గాయం కావడం ఆందోళన కలిగించింది. ఇండియా, న్యూజిలాండ్ మధ్య క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన నాథన్ స్మిత్ వేసిన బీమర్ బంతి శ్రేయస్ ఎడమ చేతికి బలంగా తగలడంతో నొప్పితో విలవిలలాడాడు. ఒకవేళ చేయికి మిస్ అయ్యి ఛాతికి తగిలినట్టయితే అయ్యర్ పరిస్థితి ప్రమాదకరంగా మారేది. అయితే, కొద్దిసేపటి తర్వాత కోలుకున్న అయ్యర్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించి 42 పరుగులతో జట్టును ముందుకు తీసుకెళ్లాడు. భారత ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది.

నాథన్ స్మిత్ వేసిన డెలివరీ నడుము ఎత్తులో ఫుల్‌టాస్‌గా వేశాడు. ఈ బంతిని శ్రేయస్ గ్లౌవ్స్‌కు తగిలి షార్ట్ ఫైన్ లెగ్ వైపు వెళ్లింది. వెంటనే నొప్పితో ఇబ్బందిపడిన అయ్యర్ కిందకు వంగిపోయాడు. ఆ బంతిని అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. బంతి అనూహ్యంగా రావడంతో తప్పించుకునేందుకు శ్రేయస్‌కు తగినంత సమయం లభించలేదు. నాథన్ స్మిత్ బంతిపై కంట్రోల్ కోల్పోవడం వల్లే అది బీమర్‌గా మారినట్లు కనిపించింది. మంచుతో కూడిన వాతావరణం బంతిపై పట్టు సాధించడం కష్టమైందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అయ్యర్‌కు దెబ్బ తగిలిన వెంటనే నాథన్ స్మిత్ అతడి వద్దకు వెళ్లాడు. తన బౌలింగ్‌లో పొరపాటున బంతి అలా రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పాడు. ఈ ఘటనలో స్మిత్ చూపిన స్పందన క్రీడాస్ఫూర్తిని చాటింది. గాయం కారణంగా శ్రేయస్ ఎక్కువసేపు మైదానంలో ఉండలేడేమోనని అభిమానులు ఆందోళన చెందారు. అయితే, అతడు తిరిగి బ్యాటింగ్ కొనసాగించడం ఊరటనిచ్చింది. చివరకు 42 పరుగులు చేయడం 226 పరుగుల ఛేజింగ్‌లో హెల్ప్ అయింది. అయ్యర్ గాయంపై అప్ డేట్ రావాల్సి ఉంది. ఇక ఈ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 226 పరుగుల టార్గెట్ ను 19.4 ఓవర్లలో ఫినిష్ చేసి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

రచయిత అవతార్

బాబు.పొలిచర్ల

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird