Home అంతర్జాతీయం Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జెన్సన్ -Andhra Waves

Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జెన్సన్ -Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Nvidia CEO Jensen Huang: నిత్యం వ్యాపార వృద్ధి.. లాభాలు.. సాధించిన విజయాలతో మీడియాలో వార్తల్లో వ్యక్తిగా ఎన్వీడియా సీఈవో జెన్సన్ నిలిచేవారు. కానీ ఈసారి ఆ లెక్కలు కాకుండా.. మరో వ్యవహారం ద్వారా ఆయన మీడియాలో నిలుస్తున్నారు. ఎన్వీడియా సీవో జెన్సన్ నేపథ్యం ఒకసారి చూస్తే.. 9 సంవత్సరాల వయసులో ఆయన తైవాన్ నుంచి అమెరికా వచ్చారు.. అక్కడ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు. కష్టాలు ఎదుర్కొన్నారు. చివరికి సెమీ కండక్టర్ డిజైన్ కంపెనీని స్థాపించారు. […]

ఎన్విడియా CEO జెన్సన్ హువాంగ్: నిత్యం వ్యాపార వృద్ధి.. లాభాలు.. సాధించిన విజయాలతో మీడియాలో వార్తల్లో వ్యక్తిగా ఎన్వీడియా సీఈవో జెన్సన్ నిలిచేవారు. కానీ ఈసారి ఆ లెక్కలు కాకుండా.. మరో వ్యవహారం ద్వారా ఆయన మీడియాలో నిలుస్తున్నారు.

ఎన్వీడియా సీవో జెన్సన్ నేపథ్యం ఒకసారి చూస్తే.. 9 సంవత్సరాల వయసులో ఆయన తైవాన్ నుంచి అమెరికా వచ్చారు.. అక్కడ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు. కష్టాలు ఎదుర్కొన్నారు. చివరికి సెమీ కండక్టర్ డిజైన్ కంపెనీని స్థాపించారు. దానిని విలువపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే వేలాదిమంది పారిశ్రామికవేత్తలకు రోల్ మోడల్ లాగా నిలిచారు. బ్రహ్మకైమా పుట్టును రిమ్మ తెగులు అనే సామెతను నిజం చేశారు. వేల కోట్లు సంపాదించి.. లక్షల మంది పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలిచిన ఆయన.. ఇప్పుడు తలవంచుకుని నిలబడ్డారు. దీనికి కారణం వివాహేతర సంబంధం.

చైనా మహిళతో ఎన్వీడియా సీఈవో జెన్సన్ వివాహేత సంబంధం పెట్టుకున్నారు. ఆ మహిళ పేరు హువాంగ్. ఈమె చైనా గూడచారి అని చూపిస్తుంది. పైగా ఎన్వీడియా సీఈవో జెన్సన్ కు చైనా మూలాలు ఉన్నాయి. వీరిద్దరి మధ్య బంధం చర్చకు దారితీస్తోంది. అంతేకాదు స్వయంగా తన సంస్థ ఉద్యోగులకు ఆయన లేఖ రాశారు. అందులో క్షమాపణలు చెప్పారు. అయితే ఆ మహిళ పేరు ఆయన ప్రస్తావించలేదు. అయితే అంతర్జాతీయ మీడియా సంస్థలు మాత్రం నాకు చెందిన గూడచారి అని.. అమెరికా భద్రత సంస్థలు ఈ సంస్థ బయటపెట్టాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు తమ కధనాలలో బయటపెట్టాయి.

ఎన్వీడియా సీఈవో జెన్సన్ వ్యవహారాన్ని మరో కోణంలో విశ్లేషకులు చూస్తున్నారు. అమెరికాకు ట్రంప్ రెండవసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత చైనాతో ట్రేడ్ యుద్ధానికి దిగారు. ముఖ్యంగా అమెరికా దేశంలో ఉన్న టెక్నాలజీ చైనాకి వెళ్లకుండా ఆయన ఆంక్షలు విధించారు. ఇందులో ఏఐ సంబంధిత కీలకమైన చిప్ లు కూడా ఉన్నాయి. ఎన్వీడియా ఏఐ ఆధారిత చిప్ లు తయారు చేయడంలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రముఖులపై చైనా గూడాచార్యం చేస్తుందని.. టెక్నాలజీని ఆక్రమంగా తమ దేశానికి తీసుకెళ్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా భద్రతా నిఘా పెట్టాయి. ఇంతవారికి అనుమానం వచ్చిందని తెలుస్తోంది.. ఇదే విషయాలను ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించాయి.

ఒక అమెరికా పౌరుడితో అత్యంత సన్నిహితంగా ఉన్న దర్యాప్తు సంస్థలకు అనుమానం వచ్చి లోతుగా తవ్వితీశాయి అయితే ఆ వ్యక్తి మరెవరో కాదని.. ఎన్వీడియా సీఈవో జెన్సన్ అని అమెరికా భద్రతా సంస్థలకు తెలిసింది. తైవాన్ రాజధానిలో రెండు సంవత్సరాల క్రితం టెక్నాలజీ ట్రేడ్ షో జరిగింది అప్పుడు ఒక మద్యం దుకాణంలో ఎన్వీడియా సీఈవో జెన్సన్, హువాంగ్ కలిసి మద్యం తాగారు. ఆ ఫోటో తొలిసారిగా బయటికి వచ్చింది గత ఏడాది అదేనగరంలో ఏఐ డిస్ట్రిబ్యూటర్స్ బిజినెస్ జరిగింది. ఆ సమయంలో డిన్నర్ జరిగింది. అప్పుడు వీరిద్దరూ ఒక రెస్టారెంట్‌లో కలిసి ఉన్నారు. అప్పుడు కూడా ఒక ఫోటో వచ్చింది. అయితే అప్పట్లో ఆమెతో తనకు వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయి అని ఎన్విడియా సీఈవో ఉన్నారు. కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య వ్యవహారం బయటకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఎవరి హూ వాంగ్

హువాంగ్ చైనా జాతీయురాలు. ముందుగా ఆమె జర్నలిస్టుగా పనిచేశారు. హువాన్ టీవీలో.. చైనా అధికారిక మీడియా సంస్థ సీసీటీవీలో విలేకరిగా పనిచేశారు. 2023లో సింగపూర్‌లో మెగా స్పీడ్ ఆన్ డేటా కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. నిజానికి చైనాకు చెందిన 7 రోడ్ సంస్థ సపోర్ట్ ఇవ్వడంతో మెగా స్పీడ్ కంపెనీ ఏర్పాటైంది. 2023లో దీనిని స్విఫ్ట్ డేటా సంస్థకు విక్రయించారు. ఈ సంస్థ 2024 జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఎన్వీడియా కంపెనీ నుంచి దాదాపు 4.8 బిలియన్ డాలర్ల విలువైన ఐఐ చిప్ లు కొనుగోలు చేసింది. అయితే వీటిని చైనా కంపెనీలకు అందజేసినట్టు అనుమానాలు ఉన్నాయి. ఆ విధంగానే ఆమె ఎన్విడియా సీఈఓ సంబంధం కొనసాగినట్లుగా ఉంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird