బెంజమిన్ నెతన్యాహు:ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహు మరోసారి పగ్గాలు చేపట్టే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఆయన ఆధ్వర్యంలోని కూటమిలోని జుడాయిజం పార్టీ (7) తటస్థంగా ఉన్నట్లు ప్రకటించారు. దీంతో కూటమి బలం 53 నుంచి 46 స్థానాలకు తగ్గిపోయింది. అటు 19 సీట్లు గెలిచిన అరబ్ పార్టీలు ఐసెన్ కోట్ కు సపోర్ట్ చేశాయి. దీంతో ఐ సెన్ కోట్ బలం మ్యాజిక్ ఫిగర్ (61) ను దాటి 67 కు పెరిగింది. నవంబర్ 8న ప్రధాని పేరును ప్రకటించబోతున్నారు.
ఇజ్రాయిల్ లో నెతన్యాహు ప్రభుత్వం మారిపోతే భారత్ కు వెంటనే ఇబ్బంది వస్తుందని చెప్పడానికి లేదు. అయితే భారత్ – ఇజ్రాయిల్ వ్యూహ సంబంధాలపై కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. భారతదేశానికి ఇజ్రాయిల్‌తో ఉన్న సంబంధాలు ఒక వ్యక్తి లేదా ఒక పార్టీకి మాత్రమే పరిమితం కాలేదు. రక్షణ, ఆయుధాల కొనుగోలు, డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు, వ్యవసాయ సాంకేతికత, సైబర్ భద్రత వంటి అనేక రంగాలలో రెండు దేశాల మధ్య సహకారం ఉంది.
రక్షణ రంగం..
భారతదేశానికి ఇజ్రాయిల్ అత్యంత కీలకమైన రక్షణ భాగస్వామి. డ్రోన్లు, క్షిపణులు, రాడార్లు, నిఘా వ్యవస్థలో సహకారం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడినా ఈ సంబంధాలు కొనసాగే అవకాశం ఉంది. అయితే కొత్త నాయకత్వం ప్రాధాన్యతల ఆధారంగా ఒప్పందాలు మారడానికి అవకాశం ఉంటుంది.
ఇరాన్ విషయంలో
ఇజ్రాయిల్ కొత్త ప్రభుత్వం ఇరాన్ దేశంతో వ్యవహరించే తీరులో మార్కులు తీసుకొస్తే భారత్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం.. చమురు ధరలు.. వాణిజ్య మార్గాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
అరబ్ దేశాలతో సంబంధాలు
కొత్త ప్రభుత్వం పాలస్తీనా అంశం మీద భిన్నమైన వైఖరి గనుక తీసుకుంటే ఇజ్రాయిల్, అరబ్ దేశాల మధ్య మార్పులు రావడానికి ఆస్కారం ఉంటుంది. భారతదేశానికి ఇజ్రాయిల్ తో పాటు గల్ఫ్ దేశాలతో బలమైన ఆర్థిక, ఇంధన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి దౌత్యపరంగాతను పాటించాల్సిన అవసరం ఉంటుంది.
వాణిజ్య ఒప్పందాలు
భారత్, ఇజ్రాయిల్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటి ప్రారంభ అంచనా వేయాల్సి ఉంటుంది.
ఐసెన్ కోట్ కు 67 మంది ఎంపీల సపోర్టు ఉందంటే ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు కాదు. ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్డోగ్ ఎవరికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలి అనేమీద ఒక క్లారిటీ రావాలి. ఆ తర్వాత మెజారిటీని కచ్చితంగా నిరూపించుకోవాలి. కొత్త కూటమిలో పార్టీల మధ్య కూడా విధానపరమైన విభేదాలు ఉన్నాయి.
మన దేశానికి ముఖ్యమైనది నేతాన్యాయ అధికారంలో ఉండటమా.. ఐసెన్ కోట్ అధికారంలోకి రావడం ఇక్కడ ముఖ్యం కాదు. కొత్త ప్రభుత్వం రక్షణ.. ఇంధనం.. వాణిజ్యం.. ఇరాన్, అరబ్ దేశాల విషయంలో ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నది ఇక్కడ అత్యంత కీలకం.
