Home సినిమా ఎక్స్ క్లూజివ్-వారణాసి డీల్ క్లోజ్! – Andhra Waves

ఎక్స్ క్లూజివ్-వారణాసి డీల్ క్లోజ్! – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఎక్స్ క్లూజివ్-వారణాసి డీల్ క్లోజ్!


రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న మోస్ట్ యాంటిసిపేట మూవీ వారణాసి. ఈ సినిమా మేకింగ్ నెంబర్లు, మార్కెటింగ్ నెంబర్లు వింటుంటే షాకింగ్ గా వుంటుంది. సినిమా విడుదల వచ్చే ఏడాది అయినా సరే, థియేటర్ మార్కెట్ క్లోజ్ చేసే పనిలో ప్రస్తుతం వుంది యూనిట్. ఓవర్ సీస్ బిజినెస్ ను 150 కోట్ల మేరకు చెబుతున్నారనే టాక్ వుంది. అయితే కేవలం 150 కోట్లు అన్నదే కాదు. ఇంకా దానికి వేరే లెక్కలు కూడా వున్నాయన్న టాక్.

 

ఆ సంగతి వుంచితే రెండు రాష్ట్రాల తెలుగు హక్కులు దాదాపు క్లోజ్ అయ్యే దశకు చేరుకున్నాయి. వారణాసి రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు దాదాపు 290 కోట్లకు క్లోజ్ చేయడం అన్నది ఆఖరి దశకు చేరుకుంది. రెండు సంస్థలు పోటాపోటీగా కోట్ చేసాయి. పది కోట్ల మార్జిన్ ఎక్కువ కోట్లు చేసి మైత్రీ సంస్థ ఈ డీల్ ను క్లోజ్ చేసినట్లు చూపుతోంది. అయితే మైత్రీ సంస్థ సోలోగా కాదు, మరో నలుగురు భాగస్వాములు కూడా ఇందులో వున్నట్లు ఉన్నారు. ఏమైతేనేం రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు జస్ట్ 290 కోట్లు.

 

అయితే ఇది ఎం జి నా, ఎన్ ఆర్ ఎ నా అన్నది ఇంకా తెలియాల్సి వుంది. ఇదిలా వుంటే కర్ణాటక ఒక్కటే 50 కోట్లు అంటున్నారు నిర్మాత. 40 నుంచి 45 కోట్ల దగ్గర బేరాలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో అన్నీ క్లోజ్ అయ్యాక ఒకే సారి బయటకు వస్తాయి.

The post ఎక్స్ క్లూజివ్-వారణాసి డీల్ క్లోజ్! iDreamPostలో మొదట కనిపించారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird