
కొన్ని సన్నివేశాలు చాలా ఇంట్రెస్ట్ ని కలిగిస్తాయి. అలాంటి సన్నివేశమే జెడి చక్రవర్తి, నీహారిక కొణిదెల మధ్య జరిగింది. ప్రొడ్యూసర్ గా రాణిస్తున్న నిహారిక తాజాగా నిర్మిస్తున్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు మాక్సిమం సిటీ స్టూడియోస్ బ్యానర్లపై ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్కు రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన ‘ది ఫస్ట్ హ్యాండ్’ టీజర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి కూడా ఉన్నారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ . తన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ బయటపెడుతున్న సమయంలో నిహారిక సరదాగా సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించడం అక్కడున్న వారందరినీ నవ్వించింది. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ తాము జులై నెలలో ప్రారంభించామని, దర్శకుడు రుద్రతో తమకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి పరిచయం ఉందని చెప్పారు. కేవలం ఆరు నెలల సమయంలోనే సినిమా పూర్తి చేసి డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో రాబోయే రోజుల్లో తమ టీమ్ అంతా మీ సోషల్ మీడియాలోకి, మీ ఇంట్లోకి వచ్చేస్తామంటూ ఆమె ఎంతో ఉత్సాహంగా చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫేమ్ త్రినాథ్ వర్మ మరియు డెబ్యూ హీరో నిర్మల్ ప్రధాన హీరోలుగా నటిస్తుండగా, ‘శుభం’ ఫేమ్ శ్రియా కొంత హీరోయిన్గా అలరించనుంది. అలాగే పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: నాగార్జున, టబు కాంబో మ్యాజిక్ రిపీట్ చేస్తుందా: ప్రేమ ప్లేస్ లో యుద్ధమేనా!
.webp)
కథాంశం విషయానికొస్తే, ఇది పూర్తిగా విదేశీ చదువులు మరియు ఇంటర్నేషనల్ గ్యాంబ్లింగ్ (జూదం) నేపథ్యంలో సాగుతుంది. బస్తీలో ఉంటూ పూట గడవడానికి కష్టపడే ఇద్దరు సాధారణ యువకులు, సడెన్‌గా శ్రీలంక దేశానికి వెళ్లడం మరియు అక్కడ గ్యాంబ్లింగ్ మాఫియా ఊబిలో చిక్కుకోవడం ఈ అసలైన మెలిక. వారి జీవితాల్లోకి ఓ అందమైన అమ్మాయి ఎంట్రీ ఇచ్చి ఒక ప్లాన్ ప్రకారం శ్రీలంక పంపించడం, అక్కడ సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి గ్యాంగ్ తో ఆ కుర్రాళ్లు ఎలా డీల్ చేశారనేది వెండితెరపై అత్యంత రసవత్తరంగా ఉండబోతోంది. శ్రీనివాస్ అవసరాలు, కిరీటి దామరాజు కీలక పాత్రలు అందించిన ఈ చిత్రానికి గ్యానీ స్కోర్ అందించారు, ఎదురోలు రాజు కెమెరా వర్క్ అందించారు. డిసెంబర్ 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
[Pocket Rockets Teaser Launch Niharika, Niharika Konidela, Pocket Rockets, JD Chakravarthy, Pink Elephant Pictures, Sri Lanka Gambling, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]
