Home సినిమా Sudigali Sudheer:సుడిగాలి సుధీర్ GOAT ట్రైలర్.. వర్కౌట్ – Andhra Waves

Sudigali Sudheer:సుడిగాలి సుధీర్ GOAT ట్రైలర్.. వర్కౌట్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Sudigali Sudheer: స్మాల్ స్క్రీన్ మీద తనదైన హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకునే సుడిగాలి సుధీర్.. హీరోగా వెండితెర మరోసారి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా రూపొందించిన చిత్రం GOAT.. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. హీరోయిన్ దివ్యభారతి ఇందులో తమిళ కథానాయక పాత్ర పోషించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో ప్రేక్షకులు కోరుకునే అంశాలు ఉండటంతో ఆసక్తిని పెంచుతుంది. ఒక కిడ్నాప్ చుట్టూ తిరిగే కామెడీ కథతో ఈ సినిమా తీసినట్టు కనిపిస్తోంది. సుధీర్ […]

సుడిగాలి సుధీర్: స్మాల్ స్క్రీన్ మీద తనదైన హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకునే సుడిగాలి సుధీర్.. హీరోగా వెండితెర మరోసారి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా రూపొందించిన చిత్రం GOAT.. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. హీరోయిన్ దివ్యభారతి ఇందులో తమిళ కథానాయక పాత్ర పోషించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో ప్రేక్షకులు కోరుకునే అంశాలు ఉండటంతో ఆసక్తిని పెంచుతుంది.

ఒక కిడ్నాప్ చుట్టూ తిరిగే కామెడీ కథతో ఈ సినిమా తీసినట్టు కనిపిస్తోంది. సుధీర్ తన బృందంతో కలిసి ఒక యువతిని కిడ్నాప్ చేయడం.. ఆమె కుటుంబం నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించడం.. దాని చుట్టూ జూదం.. శక్తివంతమైన విలన్.. ఫైట్లు.. కామెడీ.. ట్రైలర్ లో కనిపిస్తున్నాయి.. సుధీర్ మాస్ అవతారంలో కనిపించారు. అలాంటి పాత్రలు సుధీర్ కు ఇంత వరకూ పడలేదు. యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా కనిపిస్తున్నాయి. పైగా సుధీర్ తన పాత్రను చాలా ఈజ్ తో చేసారు. రొమాంటిక్ సన్నివేశాలు కూడా దండిగానే ఉన్నాయి.

సుధీర్ కు కామెడీ కొత్త కాదు. ఈ ట్రైలర్‌లో వన్ లైనర్ పంచ్ లు చాలా ఉన్నాయి. ఇందులో కూడా కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దివ్య భారతి కూడా కథలో కీలకంగా మారింది. గ్లామర్ తో పాటు ఆమె నటనకు స్కోప్ ఉన్న పాత్ర పాడినట్టుగా ఉంది. సుధీర్ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకు ఇందులో ఆసక్తి కలిగించే అంశాలు చాలానే ఉన్నాయి.. ట్రైలర్ అయితే మోస్ట్ ప్రామిసింగ్ లాగానే ఉంది. అయితే ఇందులో కనిపించే వినోదాన్ని.. సస్పెన్స్ ను సినిమా మొత్తం కొనసాగిస్తే తిరుగు ఉండదు.

ఈ సినిమా చాలా రోజుల క్రితమే మొదలైంది. నిర్మాతకు వివాదాలు వచ్చినట్లు. కొద్దిరోజులు సుధీర్ కూడా ఈ సినిమా విషయంలో అంటి ముట్టనట్టు ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఆమధ్య ఈ సినిమాలో నటించిన దివ్యభారతి కూడా సుధీర్ మీద విమర్శలు చేసినట్టు వార్తలు వచ్చాయి. చివరికి అన్నీ తొలగిపోయాయి.. సినిమా విడుదలకు సిద్ధమైనట్టు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్‌లో జెన్‌జెడ్ ఆడియన్స్ ఇష్టపడే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. పైగా సుధీర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా కాస్త పాజిటివ్ టాక్ సంపాదించుకున్నా సరే.. నిర్మాతకు కాసుల పంట పండినట్టే.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird