Telangana Politics:విపరీతమైన కరువు.. నీళ్లు లేవు. కరెంటు కూడా ఇబ్బందికరంగా సప్లై చేయవలసి వస్తోంది. రేపటి నాడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడైతే పరిస్థితి బాగోలేదు. వర్షాలు కూడా కురవడం లేదు. బొగ్గు నిలువలు తగ్గిపోయాయి. ఓపెన్ మార్కెట్లో కరెంటు దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రంగంలోకి దిగి.. పొదుపు చర్యలు పాటించాలని ప్రజలకు సూచించింది.. నిన్నటి వరకు ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు భారత్ మొత్తం మన వైపు చూసే విధంగా రేవంత్ […]
తెలంగాణా రాజకీయాలు:విపరీతమైన కరువు.. నీళ్లు లేవు. కరెంటు కూడా ఇబ్బందికరంగా సప్లై చేయవలసి వస్తోంది. రేపటి నాడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడైతే పరిస్థితి బాగోలేదు. వర్షాలు కూడా కురవడం లేదు. బొగ్గు నిలువలు తగ్గిపోయాయి. ఓపెన్ మార్కెట్లో కరెంటు దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రంగంలోకి దిగి.. పొదుపు చర్యలు పాటించాలని ప్రజలకు సూచించింది.. నిన్నటి వరకు ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు భారత్ మొత్తం మన వైపు చూసే విధంగా రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు లేవు. ఎల్ ని నో వల్ల పరిస్థితి దారుణంగా మారింది. కరువు ముంచుకుంటున్నది. ఈ నేపథ్యంలో రేవంత్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ కావాలి ముఖ్యమంత్రి లక్ష్యానికి మిగిలిన పార్టీల జై కొట్టాయి. బుధవారం సెక్రటేరియట్ లో ఆరో ఫ్లోర్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలో అన్ని పార్టీల నేతలతో సమావేశం జరిగింది.
సమావేశం ఆద్యంతం హుందాగా సాగింది. రాజకీయ విభేదాలను నాయకులు పక్కన పెట్టారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలే లక్ష్యంగా అడుగులు వేశారు. సర్కారుతో ఉప్పు నిప్పు లాగా పార్టీల నాయకులు ఏకతాటి మీదకు వచ్చారు. ఒకే వేదిక మీద కరువు నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడారు..
అఖిలపక్ష సమావేశంలో ప్రజాస్వామ్యం స్ఫూర్తిగా అనిపించింది. అన్ని రాజకీయ పక్షాల నాయకులు ఇక్కడికి వచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఉత్తంకుమార్ రెడ్డి.. తుమ్మల నాగేశ్వరరావు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. శ్రీహరి.. దానసరి సీతక్క.. గులాబీ పార్టీ వినోద్ కుమార్.. ఎల్ రమణ.. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. భారతీయ జనతా పార్టీ.. కమ్యూనిస్టు పార్టీ నాయకులు కూడా ముఖ్యులు.
ఈ సమావేశంలో వానలు లేకపోవడం.. అన్నదాతల బాధలు… తెలంగాణవాసుల కష్టాల గురించి చర్చ మొదలైంది. ప్రాజెక్టులలో నీరు తగ్గిపోతున్న నేపథ్యంలో.. వచ్చే వేసవికాలం ని దృష్టిలో పెట్టుకొని డ్రింక్ వాటర్ సప్లైకి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా.. నీటి వనరులను జాగ్రత్తగా వాడుకోవాలని నిర్ణయించారు. వ్యవసాయానికి పెద్దపీట వేయాలని సూచించారు. అంతరాయాలు లేని విద్యుత్.. ప్రస్తుతం సరఫరా మెరుగ్గా ఉండాలని.. నీరు ఎక్కువగా పడని పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. మొత్తానికి రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి నాయకులు మొత్తం ఒకే వేదిక మీద రావడం ఆనందం. అఖిలపక్షం ఇచ్చిన సూచనలను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తే కరువు రాక్షసిని తరిమికొట్టినట్టే. ఈ విషయంలో రేవంత్ రెడ్డి చూపించిన చొరవ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికీ గొప్పగా నిలిచిపోతుంది. కాగా, ఈ మీటింగ్ లో బీజేపీ, గులాబీపార్టీల నేతలు ఉన్నారు. వారు ఈ భేటీలో పాల్గొనేందుకు రేవంత్ మోడీని, కేసీఆర్ ఒప్పుకోవడం అంటే మాటలు కాదని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
