Home Latest News ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్ విడుదల: ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారంటే.? | AP DSC 2026 నోటిఫికేషన్ విడుదల | AP టీచర్ రిక్రూట్‌మెంట్ | AP DSC పోస్టుల నోటిఫికేషన్ | ఆన్‌లైన్ అప్లికేషన్ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ – Andhra Waves

ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్ విడుదల: ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారంటే.? | AP DSC 2026 నోటిఫికేషన్ విడుదల | AP టీచర్ రిక్రూట్‌మెంట్ | AP DSC పోస్టుల నోటిఫికేషన్ | ఆన్‌లైన్ అప్లికేషన్ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2 వేల721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ-2026 (ఏపీటీఆర్టి-2026) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలలతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగం, సంక్షేమ సొసైటీ పాఠశాలల్లో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఇప్పటి నుంచే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ మొత్తం ఖాళీలను మూడు రకాలుగా విభజించారు. సాధారణ పాఠశాలల్లో 2 వేల111 పోస్టులను భర్తీ చేయనుండగా, వీటిలో 906 స్కూల్ అసిస్టెంట్ 1,205 సెకండరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఇక ప్రత్యేక విద్య 350 పోస్టులుండగా వీటిలో 150 స్కూల్ అసిస్టెంట్, 200 సెకండరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఇంకా వివిధ సంక్షేమ సొసైటీలు, గురుకులాల పరిధిలో ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, పీఈటీ విభాగాల్లో మరో 260 పోస్టులను ఈ నోటిషికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

జిల్లా వారీగా ఖాళీల వివరాలను గుర్తించే.. కర్నూలు, ప్రకాశం, వైయస్ఆర్ కడప జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో పోస్టులు అందుబాటులో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఖాళీలు ఉండగా, ఆ తదుపరి స్థానాల్లో ప్రకాశం, కడప జిల్లాలు నిలిచాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల వ్యాప్తంగా ఉన్న పోస్టుల కేటాయింపు, రోస్టర్ పాయింట్లు మరియు సబ్జెక్టుల వారీగా వివరాలను విద్యాశాఖ అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ జిల్లా పోస్టుల వివరాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అభ్యర్థుల వయోపరిమితి, విద్యార్హతలు, వృత్తిపరమైన అర్హతలు, పరీక్షా విధానం, సిలబస్ మరియు హెల్ప్‌డెస్క్ సమాచారంతో కూడిన ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ tet2dsc.apcfss.in లో ఉంచారు. దీని ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ సమయంలోనే అభ్యర్థులు తమ కేటగిరీ వారిగా అందుబాటులో ఉన్న ఖాళీలను చూసుకునే అవకాశం ఉంటుంది.


[AP DSC 2026 Notification Released, AP Teacher Recruitment, AP DSC Posts Notification,   Online ApplicationAndhra Pradesh School Education Department,Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird