పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ స్టార్టింగ్‌లో వేసుకున్న కాస్ట్యూమ్స్, హెయిర్‌స్టైల్ యూత్‌లో ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ‘ఖుషి’, ‘బాలు’ చిత్రాలలో ఆయన ధరించిన రంగురంగుల టీషర్టులు, హూడీలు, బ్యాగీ జీన్స్ అప్పట్లో సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్‌గా మారాయి. అయితే పవన్ కళ్యాణ్‌ను అంత స్టైలిష్‌గా చూపించడం ఉన్న సీక్రెట్‌ని, లండన్ వేదికగా సాగిన షాపింగ్ రహస్యాన్ని నటి, కాస్ట్యూమ్ డివిజన్ రేణు దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
దాదాపు 26 ఏళ్ల క్రితం నాటి సంగతులను గుర్తు చేసుకున్న ఆమె.. పవన్ కళ్యాణ్ సినిమాల కోసం దుస్తులు ఎంపిక చేసుకునేందుకు తానే స్వయంగా లండన్ వెళ్లేదాన్నని చెప్పారు. అక్కడి ప్రముఖ ‘సెల్ఫ్రిడ్జెస్’ మాల్లో పవన్ కోసం బట్టలు వెతికే టైంలో, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ తరచూ ఎదురుపడేవారని చెప్పారు. ఆ పెద్ద మాల్లో అప్పట్లో ఇద్దరమే కనిపించేమని.. తాను పవన్ కళ్యాణ్ కోసం, కరణ్ జోహార్ షారుఖ్ ఖాన్ కోసం షాపింగ్ చేసేవారని రేణు దేశాయ్.
కరణ్ జోహార్ కాస్ట్యూమ్ డివైడ్ కాకపోయినా షారుఖ్ మీద ఉన్న ప్రేమతో ఆ పని చేసాడు, తాను కూడా పవన్‌పై ఉన్న అభిమానంతో దుస్తుల ఎంపిక బాధ్యత తీసుకున్నానని ఆమె పేర్కొన్నారు. అందుకే అప్పట్లో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’, షారుఖ్ నటించిన ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాల్లోని టీషర్టులు, జీన్స్ లుక్స్‌లో అంతటి పోలిక ఉండేదని స్పష్టం చేశారు. ఆ కాలంలో ‘గ్యాప్’ వంటి అంతర్జాతీయ బ్రాండ్లు దొరకడం చాలా అరుదని, పవన్ కళ్యాణ్ ట్రెండ్‌సెట్టర్‌గా మారిన ఐకానిక్ లుక్స్ అన్నీ లండన్‌లోని ఒక్క షాపింగ్ మాల్ నుంచే వచ్చిందని ఆమె వివరించారు. పవన్ స్టైల్ వెనుక ఉన్న ఈ ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
The post ఖుషి కాస్ట్యూమ్స్ బ్యాక్ స్టోరీ ఇదే! iDreamPostలో మొదట కనిపించారు.
