.webp)
పంజాబ్ రాజకీయాల్లో ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో గడచిన కొద్దికాలంగా పెరిగిపోతున్న మత్తు పదార్థాల సంస్కృతిని అరికట్టడంలో అధికార పార్టీ పూర్తిగా విఫలమైందని ఆయన బహిరంగంగా ఏర్పాటు చేశారు.సంగ్రూర్‌లో నిర్వహించిన ఒక భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో పార్లమెంట్ సమావేశాల సమయంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో తనకు ఎదురైన కొన్ని అనుభవాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

భగవంత్ మాన్ తన పక్కనే కూర్చుని సరదాగా కబుర్లు చెప్పేవారని రాహుల్ చెప్పారు. అయితే ఉదయం 11 గంటల సమయానికే ఆయన నోటి నుంచి మద్యం వాసన వచ్చేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎవరి వ్యక్తిగత అలవాట్లు వారి ఇష్టమని, తాను ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను విమర్శించడం లేదని రాహుల్ స్పష్టం చేశారు. కానీ రాష్ట్రంలో తీవ్రంగా వేధిస్తున్న డ్రగ్స్ భూతాన్ని అంతం చేయాలనే సంకల్పం ఉన్నప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రతిరోజూ మత్తులో ఉంటే సమస్య ఎలా పరిష్కారమవుతుందని ఆయన నిలదీశారు.ఆప్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయిందని రాహుల్ అన్నారు.

పంజాబ్ పరిపాలన అంతా ఢిల్లీ నుంచి నడుస్తోందని, రాష్ట్ర రిమోట్ కంట్రోల్ ఇతరుల చేతుల్లో ఉందని.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన కాలపరిమితిపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. మూడేళ్లలో డ్రగ్స్ సమస్యను పూర్తిగా తొలగిస్తున్నామనడంలో ఎలాంటి వాస్తవం లేదని ఎద్దేవా చేశారు.రాబోయే రోజుల్లో పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వయంగా ఇక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడుపుతామని స్పష్టం చేశారు. నాయకత్వం తీరును మార్చుకోకపోతే ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని ఆయన అభిప్రాయపడ్డారు.
[ Rahul Gandhi, Bhagwant Mann, Punjab politics, AAP government, drug menace Punjab, Sangrur Congress Rally, Arvind Kejriwal, Punjab Politics, Telugu One, Telugu News ]
