Home ఆంధ్రప్రదేశ్ Amaravati Flood News: నీట మునిగిన బాబు ఫ్యూచర్ సిటీ.. – Andhra Waves

Amaravati Flood News: నీట మునిగిన బాబు ఫ్యూచర్ సిటీ.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Amaravati Flood News: అంతటి అమెరికాలో భారీగా వర్షం కురిస్తే వరద నీరు రోడ్ల మీదకి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వరద పెద్దపెద్ద భవంతులను ముంచేస్తుంది. మంచు తుఫాను వచ్చినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ప్రకృతి విపత్తు చోటు చేసుకున్నప్పుడు ఎంతటి అభివృద్ధి చెందిన దేశమైనా సరే తలవంచాల్సిందే. అక్కడిదాకా ఎందుకు.. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో గట్టిగా వర్షం పడితే కాలనీలు నీట మునిగిపోతాయి. రోడ్లు చెరువులను తలపిస్తాయి. ఇక […]

అమరావతి వరద వార్తలు: అంతటి అమెరికాలో భారీగా వర్షం కురిస్తే వరద నీరు రోడ్ల మీదకి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వరద పెద్దపెద్ద భవంతులను ముంచేస్తుంది. మంచు తుఫాను వచ్చినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ప్రకృతి విపత్తు చోటు చేసుకున్నప్పుడు ఎంతటి అభివృద్ధి చెందిన దేశమైనా సరే తలవంచాల్సిందే. అక్కడిదాకా ఎందుకు.. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో గట్టిగా వర్షం పడితే కాలనీలు నీట మునిగిపోతాయి. రోడ్లు చెరువులను తలపిస్తాయి. ఇక లోతట్టు ప్రాంతాలు అయితే చెప్పాల్సిన పనిలేదు. వర్షం వచ్చింది కదా.. మునిగిపోయింది కదా.. అని తెలంగాణ పాలకులు ఊరుకోవడం లేదు కదా. అభివృద్ధి చేసుకుంటూనే పోతున్నారు కదా. వరద నీటిని దారి మళ్లించి.. సరికొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు కదా.. ఈ విషయం సామాన్య ప్రజలకు అర్థమవుతోంది. చివరికి అక్షరజ్ఞానం లేని వారికి కూడా కనిపిస్తుంది. కానీ ఏపీలో సాక్షి మీడియాకు.. ఇంకా కొన్ని తోక మీడియా సంస్థలకు అర్థం కావడం లేదు.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని అభివృద్ధిని పక్కన పెట్టారు. తెర మీదకి మూడు రాజధానులు అంటూ హడావిడి చేశారు. ఆయన అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఒక్కరోజు కూడా రాజధాని అభివృద్ధి గురించి మాట్లాడలేదు. చివరికి రాజధాని లో ఉన్న భూములను.. ఇతర వస్తువులను ఒక కులానికి అంటగట్టారు. రిషికొండను ధ్వంసం చేసి పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. మూడు రాజధానులు అంటూ అధికారంలో ఉన్న ఆయన.. అధికారం చివరి దశలో విశాఖ క్యాపిటల్ సిటీ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తానని.

నిజానికి ఆయన అధికారంలో ఉన్న రోజులు అమరావతి అంధకారంలో ఉంది. ఏపీ రాజధాని లేని ప్రాంతంగా ఉంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు వేగం పుంజుకున్నాయి. సిఆర్డిఏ పరిధిలో రోడ్లు.. డ్రైనేజీలు.. ఇంటర్నెట్ కేబుల్.. వంటి వ్యవస్థలు వేగంగా సాగుతున్నాయి. రాజధాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు కూడా నిర్మాణం అవుతోంది. త్వరలో విజయవాడ.. విశాఖపట్నం నగరాలకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా ఒక అభివృద్ధి నమూనా.. ప్రపంచంలో ఏ దేశాన్ని చూసినా సరే అభివృద్ధి అనేది ఇలాంటి విధానంలోనే కనిపిస్తుంది. చంద్రబాబుకు దూర దృష్టి ఎక్కువ కాబట్టి ఆయన మరింత ఫోకస్ పెట్టి పనులు చేస్తున్నారు.

చంద్రబాబు ప్రయత్నానికి అడుగడుగునా ఇబ్బంది కలిగించేందుకు సాక్షి ప్రయత్నాలు చేస్తోంది. విష ప్రచారం బ్రహ్మాండంగా చేపడుతోంది. ఇటీవల మురుసు తుఫాన్ ఏపీ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. చంద్రబాబు నిర్మాణం అమరావతి మాత్రమే కాదు.. గత పాలకులు నిర్మించిన అనేక భవనాలలో నీరు వచ్చింది. అయినంత మాత్రాన ఆ పరిపాలకుల పనితీరును తప్పు పట్టలేము కదా కానీ ఈ విషయంలో సాక్షి.. భూతద్దాలు కండ్లకు పెట్టుకొని అమరావతిని చూస్తోంది. వర్షం వల్ల వచ్చిన వరదనీరు అమరావతి నగరాన్ని మొత్తం ముంచేసిందట. చంద్రబాబు నిర్మాణం ఫ్యూచర్ సిటీ నీట మునిగిపోయిందట. అసలు ఇంతటిజం ఏంటి.. దీనిని జర్నలిజమంటారా.. ఏపీ గురించి నెగిటివ్ ప్రచారం చేస్తే.. అది రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల మీద ప్రభావం చూపుతుంది కదా.. అంటే పెట్టుబడి రాకూడదని వైసిపి కోరుకుంటున్నదా.. అంటే రాష్ట్రం గురించి చెడ్డగా ప్రచారం చేసి అధికారంలోకి రావాలని వైసిపి కోరుకుంటుందా.. అని టిడిపి నేతలు అంటున్నారు.

వైసిపి చేస్తున్న విష ప్రచారం మీద ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. భారీ వర్షాల వల్ల అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ పరిసరాలు.. రైతులకు కేటాయించిన ప్లాట్ల వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని.. రాజధాని ప్రాంతం మొత్తం వరదతో మునిగిపోయిందని కొన్ని న్యూస్ ఛానల్.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. భారీ వర్షాల వల్ల రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశాలలో తీసిన గోధులలో.. చేసిన తవ్వకాలలో మీరు చేయడం వాస్తవమే. అమరావతి పరిధిలోని రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ.. డక్టింగ్.. అండర్ గ్రౌండ్ పనుల కోసం పెద్ద ఎత్తున గోతులు తవ్వారు. నిర్మాణాలు వేగంగా సాగిపోతున్నాయి. వర్షం నీరు నిర్మాణ పనుల గోతుల్లో నిలవడం అత్యంత సహజం. అయితే దీనిని ఆధారంగా చేసుకుని రాజధాని అంతా మునిగిపోయింది.. వరద బీభత్సం అని ప్రచారం చేయడం అతిశయోక్తి.. తప్పుడు కోణంలో చూపించడమే అవుతుంది. ఒక టీవీ ఛానల్ లో మరీ బాధ్యత లేకుండా శాఖమూరు రిజర్వాయర్ విజువల్స్ వేసి అమరావతి ముగిసిపోయింది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరొక ఛానల్ లో డ్రైనేజీ.. డక్టింగ్ పనుల గుంతలను.. వాటిలో చేరిన నీటిని చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఛానల్ చూసిన తప్పుడు వీడియోలను మరికొందరు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఎక్కడా ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితి లేదు. ఈ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రకటించింది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird