సోషల్ మీడియా సెన్సేషన్ సురేంద్ర సింగ్ చౌదరి, అలియాస్ బిట్టు తబాహి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. బిట్టు మధ్యప్రదేశ్లోని కలుషిత అజ్నార్ నదిని శుభ్రం చేయడానికి నిరంతరం శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. కలుషిత నీటిని శుభ్రం చేస్తే ఆయన చేతులు, కాళ్లకు తీవ్రమైన చర్మ ఇన్ఫెక్షన్లు సోకాయి. ప్రస్తుతం చర్మం ఊడిపోతూ భరించలేని నొప్పితో బాధపడుతున్నాడు. కనీస భద్రత లేకుండా కలుషిత నీటిని శుభ్రం చేయడం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై ఈ ఘటన ఆందోళన రేకెత్తిస్తోంది.
బిట్టు తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను కలవరపాటుకు గురిచేస్తోంది. అజ్నార్ నదిలోని కుళ్లిపోయిన వ్యర్థాలను, కలుషిత నీటిని తొలగిస్తే గంటల తరబడి నీటిలోనే గడపడం వల్ల తన చేతులు, కాళ్ల చర్మం పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపాడు. నిరంతరం దురద పెట్టడం, చర్మం పొరలుగా ఊడిపోవడం, తీవ్రమైన శారీరక నొప్పితో తాను బాధపడుతున్నానని. బిట్టు తబాహి సాధారణంగా రబ్బరు గ్లోవ్స్, బూట్లు, కర్రల సాయంతోనే నదిలోని భారీ వ్యర్థాలను తొలగిస్తాడు.
అయితే, కెమికల్స్.. డ్రైనేజీ మురుగు.. కుళ్లిపోయిన చెత్తతో తీవ్రంగా కలుషితమైన నదీ జలాలను శుభ్రం చేయడానికి ఈ కనీస పరికరాలు సరిపోవని తాజా ఘటన నిరూపించబడింది. హానికరమైన సూక్ష్మజీవుల ప్రభావం వల్ల అతడి చర్మం ఇన్ఫెక్షన్కు గురైందని తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో చూసిన వేలాది మంది నెటిజన్లు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. పర్యావరణం కంటే ముందు ఆరోగ్యం ముఖ్యమని, వెంటనే తగిన వైద్య చికిత్స నిపుణులు సూచిస్తున్నారు.

