Home సినిమా Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం.. – Andhra Waves

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Sai Dharam Tej:మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు.. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్నారు. తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించిన ఆయన.. ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చినప్పటికీ.. తనకంటూ మేనరిజాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డిఫరెంట్ కథలతో.. ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. త్వరలో ఆయన సంబరాల ఏటిగట్టు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పిరియాడికల్ డ్రామాలాగా ఈ సినిమా రూపొందుతోంది. విరూపాక్ష సినిమా […]

సాయి ధరమ్ తేజ్:మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు.. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించిన ఆయన.. ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చినప్పటికీ.. తనకంటూ మేనరిజాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డిఫరెంట్ కథలతో.. ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. త్వరలో ఆయన సంబరాల ఏటిగట్టు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పిరియాడికల్ డ్రామాలాగా ఈ సినిమా రూపొందుతోంది. విరూపాక్ష సినిమా ద్వారా తిరుగులేని బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు సాయి ధరమ్. పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన బ్రో సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

కెరియర్ పిక్స్ లో ఉండగానే సాయి ధరమ్ తేజ్ వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్నారు. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థ వేడుక గురువారం జరిగింది. సాయి ధరమ్ తేజ్ సినిమా రంగానికి చెందిన యువతి ని కాకుండా.. తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు మెగా కుటుంబానికి చెందిన మొత్తం హీరోలు. అల్లు అర్జున్.. రామ్ చరణ్ తేజ్.. వరుణ్ తేజ్.. అల్లు శిరీష్.. వైష్ణవ తేజ్.. నిహారిక.. సుస్మిత.. అల్లు వెంకటేష్ (బాబి) ప్రముఖులు. కాబోయే దంపతులతో కలిసి దిగిన ఫోటోలు రామ్ చరణ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాదులో డిసెంబర్ 10న సాయి ధరమ్ తేజ్, కిరణ్మయి వివాహం జరుగుతుందని తెలుస్తోంది.

సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే సినిమాలో నటిస్తున్నారు . ఈ సినిమా తర్వాత ఇంకా కొన్ని ప్రాజెక్టులను ఆయన లైన్ లో పెట్టారు. విరూపాక్ష సినిమా తర్వాత సినిమాల ఎంపిక విషయంలో సాయి ధరమ్ తేజ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. స్పీడ్ గా కాకుండా.. చాలా జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కథా బలం ఉన్న సినిమాలకు మాత్రమే ఆయన పచ్చ జెండా ఊపుతున్నారు. సాయి ధరమ్ తేజ్ కెరియర్లో ఎన్నో మంచి సినిమాలు ఉన్నాయి. అందులో రిపబ్లిక్ సినిమా ప్రత్యేకమైనది. దేవా కట్ట దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సాయి ధరం తేజ్, కిరణ్మయి స్నేహితులని.. వీరిద్దరి మధ్య చాలా సంవత్సరాలుగా ప్రేమ బంధం ఉందని తెలుస్తోంది. పెద్దల అనుమతి తీసుకున్న తర్వాత వీరిద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు. నిశ్చితార్థ వేడుకకు సినిమా సెలబ్రిటీలు కూడా ఉన్నాయి. హైదరాబాద్. అత్యంత గ్రాండ్ గా సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నారు ఈ వేడుకకు సినీ సెలబ్రిటీలు.. రాజకీయ ప్రముఖులు.. అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది..



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird