Home అంతర్జాతీయం Plumber Eye Plant: ప్లంబర్ కంట్లో విత్తనం మొలిచి మొక్కైంది.. -Andhra Waves

Plumber Eye Plant: ప్లంబర్ కంట్లో విత్తనం మొలిచి మొక్కైంది.. -Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Plumber Eye Plant: కలలు సాగు చేసుకోవాలంటే కన్నుల నీరు అవసరం.. గుండె బాధ తీరాలంటే కంటనీరు ఒలకాలి. సముద్రం దాటని మనిషి ఉంటాడేమో గాని.. కన్నీటిని దాటి జీవితాన్ని గెలిచిన మనిషి ఉండడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ఎందుకంటే ఒక మనిషి జీవితాన్ని కళ్ళు లేకుండా.. కన్నీరు ప్రస్తావన లేకుండా వివరించలేం. నేత్రాలు మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలు. అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. ఈ కథనంలో ఒక వ్యక్తి నేత్రం […]

ప్లంబర్ ఐ ప్లాంట్: కలలు సాగు చేసుకోవాలంటే కన్నుల నీరు అవసరం.. గుండె బాధ తీరాలంటే కంటనీరు ఒలకాలి. సముద్రం దాటని మనిషి ఉంటాడేమో గాని.. కన్నీటిని దాటి జీవితాన్ని గెలిచిన మనిషి ఉండడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ఎందుకంటే ఒక మనిషి జీవితాన్ని కళ్ళు లేకుండా.. కన్నీరు ప్రస్తావన లేకుండా వివరించలేం. నేత్రాలు మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలు. అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు.

ఈ కథనంలో ఒక వ్యక్తి నేత్రం వల్ల అతని జీవితం రకరకాల మలుపులు తిరిగింది. అతడు తన నేత్రాలను జాగ్రత్తగా కాపాడుకున్నాడు. కానీ విధి రాసిన రాతవల్ల అతని కథ మతం మారిపోయింది. చివరికి అతని కంట్లో ఒక మొక్క మొలిచింది. అది ఏకంగా మూడు మిల్లీమీటర్ల మేర పెరిగింది. అయితే చూపు మందగించడంతో అతడు వైద్యులను సంప్రదించాడు. ఆ తర్వాత అసలు కథ ఏంటనేది బయటి ప్రపంచానికి తెలిసింది.

అతని కన్ను చూసేందుకు మాత్రమే కాకుండా.. ఒక మొక్క మొలవడానికి కారణమైంది. అతని కన్నీరు ఆ విత్తనానికి ఆస్కారమైంది. నాలుగు నెలలుగా తీవ్రమైన తలనొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. కన్ను కూడా విపరీతంగా వచ్చింది. తట్టుకోలేక నేత్ర సామర్థ్యాన్ని సంప్రదించాడు.. పరీక్షించిన వైద్యుడు..”నీ కన్నులో మొక్క మొలిచింది” అని ఆయన చెప్పగానే అతడికి ఒక్కసారిగా భయం అయింది. అలా మొక్క మొలవడానికి కారణం.

సరిగా ఈ ఏడాది జనవరిలో అతడు ఒక అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక చెట్టుకొమ్మ అదడి ముఖానికి తగిలింది. కంట్లో ఏదో పడినట్టు అనిపించడంతో.. తన చేత్తో నలిపాడు. కొద్దిసేపటికి కన్ను ఎర్రగా మారింది. ఆ తర్వాత తగ్గిపోయింది. అయితే గడిచిన నాలుగు నెలల క్రితం అతడికి విపరీతమైన తలనొప్పి మొదలైంది. ఆ తలనొప్పి మొదట్లో ఒక స్థాయి వరకు ఉండేది. ఆ తర్వాత మరింత పెరగడంతో.. తట్టుకోలేక అతడు సంప్రదించాడు. చివరికి ఆయన పరీక్షించి కంట్లో మొక్క మొలచిందని చెప్పడంతో.. అతడు భయపడ్డాడు. చివరికి శస్త్ర చికిత్స చేసి కంట్లో మలచిన మొక్కను తొలగించారు. ఆ మొక్క దాదాపు మూడు మిల్లీమీటర్ల పొడవు ఉంది. నిజానికి ఆ విత్తనం నేత్రం లోపలి భాగంలో పడింది. ఆ తర్వాత ఆ ప్లంబర్ గుర్తించలేదు. తలనొప్పి కూడా మొదట్లో మాములుగానే ఉండేది. ఆ తర్వాత తీవ్రం కావడంతో అసలు విషయం బయటపడింది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird