Home అంతర్జాతీయం అమెరికా అధ్యక్షుడు: చరిత్రలో అమెరికా ప్రెసిడెంట్ స్వయంగా -Andhra Waves

అమెరికా అధ్యక్షుడు: చరిత్రలో అమెరికా ప్రెసిడెంట్ స్వయంగా -Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


అమెరికా అధ్యక్షుడు: అమెరికా అధ్యక్షుడు.. ఇది సామాన్యమైన పదవి కాదు. అమెరికాకు ప్రెసిడెంట్ అంటే.. కేవలం ఆ దేశానికి మాత్రమే కాదు.. ప్రపంచానికి లాంటివాడు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక శక్తిగా.. సైనిక శక్తిగా.. సామాజిక శక్తిగా అమెరికా వెలుగొందుతోంది. ఒకరకంగా అమెరికా తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ప్రపంచం మీద ప్రత్యక్షంగా.. పరోక్షంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అమెరికాకు అధ్యక్షుడి స్థానంలో ఉన్న వారికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన విలువ ఉంటుంది. అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉన్నవారు […]

అమెరికా అధ్యక్షుడు: అమెరికా అధ్యక్షుడు.. ఇది సామాన్యమైన పదవి కాదు. అమెరికాకు ప్రెసిడెంట్ అంటే.. కేవలం ఆ దేశానికి మాత్రమే కాదు.. ప్రపంచానికి లాంటివాడు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక శక్తిగా.. సైనిక శక్తిగా.. సామాజిక శక్తిగా అమెరికా వెలుగొందుతోంది. ఒకరకంగా అమెరికా తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ప్రపంచం మీద ప్రత్యక్షంగా.. పరోక్షంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది.

అమెరికాకు అధ్యక్షుడి స్థానంలో ఉన్న వారికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన విలువ ఉంటుంది. అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉన్నవారు అత్యంత శక్తివంతంగా ఉంటారు. అయితే అటువంటి అమెరికా అధ్యక్షుడు స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మరో దేశ అధినేతకు స్వాగతం పలకడం అంటే మామూలు విషయం కాదు. ఇటువంటి అరుదైన, అద్భుతమైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు ఒక వ్యక్తి. అయితే ఈ జాబితాలో ఎంతోమంది నాయకులు కనిపిస్తారు.. ఇందులో మొదటి పేరు మాత్రం అత్యంత ప్రత్యేకం. ఆ పేరుకు భారతదేశానికి అత్యంత అభినాభావ సంబంధం ఉంది.

ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు

అమెరికా అధ్యక్షుడు స్వయంగా విమానాశ్రయానికి వెళ్లడం.. మరో దేశ అధినేతకు స్వాగతం పలకడం అత్యంత అరుదైన దౌత్యపరమైన సంప్రదాయం. వైట్ హౌస్ లో అధికారికంగా స్వాగతాన్ని స్వీకరిస్తారు. అయితే అరుదైన వ్యక్తులు మాత్రమే అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్నవారు విమానాశ్రయానికి వెళ్లి విదేశాల అధినేతలకు స్వాగతం పలుకుతారు. అలా అమెరికా అధ్యక్షుడు స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పగడం ఇటీవల చోటు చేసుకుంది. ప్రస్తుతం అమెరికాకు అధ్యక్షుడిగా కొనసాగుతున్న ట్రంప్ 23న జైంట్ బేస్ ఆండ్రూస్ కోసం వెళ్లి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు స్వయంగా స్వాగతం పలికారు. నిజంగా ఈ అరుదైన సంప్రదాయాన్ని ట్రంప్ మరోసారి చర్చలకు తీసుకొచ్చారు. వాస్తవానికి ఇటువంటి అమెరికా విదేశాంగ శాఖ లేదా ఇతర అధికారులు హాజరవుతారు. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు స్వయంగా విమానాశ్రయానికి వెళ్లడం మాత్రం ప్రత్యేకమైన గౌరవంగానే చెబుతారు.

ఇదే తొలిసారి కాదు.

  • చైనా అధ్యక్షుడికి ట్రంప్ స్వాగతం పలకడం ఇదే తొలిసారి కాదు. అమెరికాకు గతంలో అధ్యక్షుడిగా పని చేసిన జాన్ ఎఫ్ కెనడీ తన పదవి కాలంలో అనేక మంది విదేశాలకు వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో స్వయంగా స్వాగతం పలికారు. ఈ జాబితా ట్యూనిషియా అధ్యక్షుడు హబీబ్.. కామెరాన్ అధ్యక్షుడు అహ్మద్.. పేరు అధ్యక్షుడు మాన్యుయల్ వంటి వారికి స్వాగతం పలికారు.
  • 1971లో జపాన్ చక్రవర్తి హిరి హీతో అమెరికాలో ఉన్నారు. నాట్ అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అలస్కాలో యాంకరేజ్ కనిపించారు. అక్కడ జపాన్ చక్రవర్తికి స్వాగతం పలికారు. జపాన్ చక్రవర్తి తొలిసారిగా అమెరికాలో పర్యటన సందర్భం కూడా అదే. నీతో నాడు జరిగిన ఈ సమావేశం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకంగా జరిగింది.

ఏకంగా రెండుసార్లు

ఇక మన దేశానికి సంబంధించి తొలి ప్రధానమంత్రి నెహ్రూకు ఏకంగా రెండుసార్లు అమెరికా అధ్యక్షులు వచ్చి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. రోజుల్లో స్వాతంత్రం వచ్చిన తొలి నెహ్రూ అమెరికాలో ఉన్నారు. అక్టోబర్ 11న నెహ్రూ అక్కడ అధికారికంగా ఉన్నారు. ఆయన వాసి ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో దిగినప్పుడు నాడు అమెరికా అధ్యక్షుడు హరి ఎస్ ట్రూమన్ నెహ్రుకు స్వయంగా స్వాగతం పలికారు. అమెరికా అధికారిక రికార్డుల ప్రకారం 19 తుపాకుల గౌరవ వందనం లభించింది. సైనికులు స్వాగత కార్యక్రమాల్లో ఉన్నారు. మళ్లీ 12 సంవత్సరాల తర్వాత అంటే 1961 నవంబర్ 6న నెహ్రూ అమెరికాలో ఉంటున్నారు. నాటి అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి వాషింగ్టన్ లోని ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో నెహ్రూ కు స్వాగతం పలికారు. నాడు అమెరికా అధ్యక్షుడు చేసిన అధికారిక ప్రసంగం అమెరికా ప్రెసిడెంట్ రికార్డులో ఉంది. నాడు నెహ్రూ ఉన్న ఉద్దేశించి కెనడి గొప్ప మాటలు మాట్లాడారు. ఆయన ఖ్యాతి అద్భుతమైనదని.. భారత సరిహద్దులు దాటి ఇక్కడ దాకా వచ్చారని.. ఆయన వల్ల అమెరికా భారత సంబంధాలు మరింత బలపడతాయని చెప్పారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird