Home Latest News అర్నాబ్ నష్టం అంచనాకు త్వరలో ఏపీకి కేంద్ర బృందం: చంద్రబాబుకు అమిత్ షా హామీ.! | అమిత్ షా సైక్లోన్ అర్నాబ్ రివ్యూ | తుపాను ఆర్నాబ్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు | కేంద్ర బృందాలు | తుఫాను నష్టాన్ని అంచనా వేయండి | AP తుఫాను ఉపశమనం | CBN | అమిత్ షా | జాతీయ విపత్తు – Andhra Waves

అర్నాబ్ నష్టం అంచనాకు త్వరలో ఏపీకి కేంద్ర బృందం: చంద్రబాబుకు అమిత్ షా హామీ.! | అమిత్ షా సైక్లోన్ అర్నాబ్ రివ్యూ | తుపాను ఆర్నాబ్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు | కేంద్ర బృందాలు | తుఫాను నష్టాన్ని అంచనా వేయండి | AP తుఫాను ఉపశమనం | CBN | అమిత్ షా | జాతీయ విపత్తు – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


దేశవ్యాప్తంగా తీర ప్రాంతాలను వణికిస్తున్న అర్నబ్ తుపాను ముప్పు మరియు దాని అనంతర పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ విపత్కర పరిస్థితుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన టెలిఫోన్ లొ మాట్లాడారు.

తుపాను ధాటికి ఆయా ప్రాంతాల్లో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజల సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన అమిత్ షా, రాష్ట్రంలో తుపాను సృష్టించిన బీభత్సం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో వ్యవసాయం మరియు ఉద్యాన పంటలు దెబ్బతినడం, రోడ్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థలు చిన్నాభిన్నం కావడంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని వివరించిన చంద్రబాబు, మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు, రైతులకు అండగా నిలిచేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక సాయం.

తుపాను కారణంగా సంభవించిన నష్టాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి వీలుగా త్వరలోనే కేంద్ర బృందాన్ని బాధిత రాష్ట్రాలకు పంపిన అమిత్ షా ప్రకటించారు. ఆ బృందం నివేదిక ఆధారంగా రాష్ట్రాలకు తగిన ఆర్థిక సహాయం కేంద్రం వేగవంతం చేస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు.

[Amit Shah Cyclone Arnab Review, Cyclone Arnab Affected States CMs, Central Teams, Estimate Cyclone Damage, AP Cyclone Relief, CBN,  Amit Shah, National Disaster, Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird