హరీష్ రావు : నిన్న గాంధీభవన్లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కరువు కాలంలో ప్రజలకు ఏదైనా చెప్తే భరోసా ఇస్తారని. కానీ ఆయన అలా చేయలేదు. పైగా ఈసారి నేను కొత్త విషయం చెప్తాను అంటూ.. మిస్టరీ సినిమా ప్రమోషన్ లాగా ఊదరగొట్టారు. చివరికి కేటీఆర్ గురించి చెప్పి.. […]
హరీష్ రావు: నిన్న గాంధీభవన్లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కరువు కాలంలో ప్రజలకు ఏదైనా చెప్తే భరోసా ఇస్తారని. కానీ ఆయన అలా చేయలేదు. పైగా ఈసారి నేను కొత్త విషయం చెప్తాను అంటూ.. మిస్టరీ సినిమా ప్రమోషన్ లాగా ఊదరగొట్టారు. చివరికి కేటీఆర్ గురించి చెప్పి.. ఒక వర్గం మీడియాకు.. యూట్యూబ్ లకు కంటెంట్ క్రియేటర్ అయ్యారు.
గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తన భార్య శైలికి తెలియకుండా ట్రిప్పులకు వెళ్తారట. మారు పేర్లతో టికెట్లు బుక్ చేసుకుంటారట. స్పెషల్ జెట్ లలో వెళ్తారట. ఇదంతా అబద్ధం కాదట. ఒకవేళ అబద్ధమని తేలితే తన కొడుకు మీద ఒట్టు వేసి చెప్పాలట. తన భార్య పిల్లల్ని మోసం చేయాల్సిన అవసరం గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఏముంటుంది.. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే అది ఎమ్మెల్సీకి ఏం కావాలి.. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద విమర్శలు చేయాలంటే విధానపరంగా చేయాలి. ఎలాగూ ప్రభుత్వం కూడా వాళ్ళదే కాబట్టి విచారణకు ఆదేశించాలి. అవసరమైతే జైల్లో కూడా పెట్టాలి. అలాకాకుండా ఈ మారు పేర్లు.. స్పెషల్ జెట్ విమానాలు.. అంటూ లేకి విమర్శలు దేనికి..
వెంకట్ గాంధీభవన్లో మాట్లాడిన తర్వాత.. నిన్నటి రోజు రాత్రి బిగ్ డిబేట్లో ఏబీఎన్ ఇదే విషయం చర్చనీయాంశమైంది. ఇక ఈసారి మైకు దొరకడంతో వెంకట్ మరింత రెచ్చిపోయారు. యూట్యూబర్లకు ప్రతినెల గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోట్లల్లో చెల్లిస్తున్నారని.. నెగిటివ్ ప్రాపగండ చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పింక్ పార్టీ అపోజిషన్ లో ఉంది కాబట్టి.. భారీగా చెల్లిస్తోంది. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమైంది. అధికారంలోనే ఉంది కదా.. గులాబీ పార్టీకి కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోతోంది..
ఎమ్మెల్యేలు.. మంత్రులు.. ఎంపీలు.. ఇంకా పెద్ద పెద్ద స్థాయి మొత్తం హస్తంలోనే కదా.. వారంతా ఏం చేయలేకపోతున్నారా.. వాళ్ల వల్ల ఏమీ కాలేకపోతోందా.. అసలు ఈనాటికీ రూలింగ్కు ఒక కౌంటర్ వ్యవస్థ ఉందా.. దానిని వెంకట్ పరిశీలించాలి కదా.. కొన్ని యూట్యూబ్ ఛానల్ రూలింగ్కు డప్పు కొడుతోంది కదా.. సంస్థలు బాకాలు ఊదుతాయి.. కాంగ్రెస్ పార్టీకి కూడా జరుగుతోంది.. అలాంటప్పుడు ఈ వెంకట్ ఎందుకు విస్మరిస్తున్నారు..
కేటీఆర్ ప్రవేట్ ట్రిప్పులు విషయాన్నీ పక్కన పెడితే.. ఆ మధ్య హరీష్ ఏ పూజలు చేశారంటూ ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కిందిస్థాయి నాయకులు. వాస్తవానికి ఇంతవరకు ఆ పూజలు జరిగినట్టు.. ఆ పూజలు చేసినట్టు ఆధారాలు చూపించలేకపోయారు. ఒకవేళ ఆ తరహా వ్యవహారాలు నిర్వహిస్తే దాని ఎఫెక్ట్ గవర్నమెంట్ మీద పడుతుందా.. అసలు అలాంటి వ్యవహారం రియల్ లైఫ్ లో సాధ్యమా.. ఒకవేళ అదే జరిగితే శాస్త్రసాంకేతిక రంగాలు ఎందుకు.. ఈ స్థాయిలో ఎక్స్ పర్మెంట్స్ ఎందుకు.. ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో మనిషి అద్భుతాలు చేస్తుంటే.. రూలింగ్ పార్టీ లీడర్లు మాత్రం మంత్రాలు.. చేతబడులు అంటూ మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలపై లేదా అవినీతిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది.
