తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మధ్య జరిగిన భేటీతో తుమ్మిడి హట్టి బ్యారేజ్ పై కీలకమైన ముందడుగు పడింది. అయితే ఈ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో అనుమతి లభించలేదు. తెలంగాణ ప్రతిపాదనపై సానుకూలంగా సూచన.. కీలకమైన అంశాలను పరిశీలించేందుకు అధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ప్రధానంగా చర్చ జరిగింది బ్యారేజీ.. గతంలో కుదిరిన ఎత్తు ఒప్పందంలో 148 […]
తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మధ్య జరిగిన భేటీతో తుమ్మిడి హట్టి బ్యారేజ్ నిర్మాణం పై కీలకమైన ముందడుగు పడింది. అయితే ఈ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో అనుమతి లభించలేదు. తెలంగాణ ప్రతిపాదనపై సానుకూలంగా సూచన.. కీలకమైన అంశాలను పరిశీలించేందుకు అధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ప్రధానంగా చర్చ జరిగింది
బ్యారేజీ ఎత్తు.. గతంలో కుదిరిన ఒప్పందంలో 148 మీటర్ల ఎత్తు ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం దానిని 152 మీటర్లకు పెంచాలని కోరింది.
నీటి లభ్యత.. ప్రతిపాదిత ఎత్తులో తెలంగాణకు ఎంత నీరు అందుతుంది.. సాగు అవసరాలను ఎలా తీర్చాలి అని చర్చించారు.
ముంపు సమస్య.. మహారాష్ట్రలో వ్యవసాయ భూములు ఎంత మేరకు ముంపునకు గురవుతున్నాయి. సాంకేతిక అంశాలు.. పర్యావరణం.. నీటి లభ్యత బ్యారేజీ నిర్మాణ ప్రభావం నిర్ణయించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నారంటే..
మహారాష్ట్రకు.. అక్కడి ప్రజలకు ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండకపోతేనే తెలంగాణ ప్రతిపాదనను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫడ్నవిస్ సంకేతాలు ఇచ్చారు. అయితే తుది నిర్ణయానికి ముందు.. సాంకేతిక.. పర్యావరణ.. ముంపు.. పరిహారం అంటే సమగ్రంగా అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. దీనికోసం రాష్ట్రాల నీటిపారుదల శాఖలతో రెండు కమిటీలు ఏర్పాటు చేసి.. బ్యారేజీ ఎత్తు.. నీటి లభ్యత.. ముంపు ప్రభావం పై రూపొందించాలని ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు.
తెలంగాణకు ఎందుకు కీలకం
తుమ్మిడిహట్టి బ్యారేజిని ప్రాణహిత నదిపై నిర్మించడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగు, అవసరాలు తీర్చాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎప్పటివరకు గ్రావిటీ ఆధారంగా నీటిని తరలించి.. విద్యుత్ ఖర్చులను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆదివాసీ.. గిరిజన ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతోంది. ఈ పరిశీలనల అనంతరం రెండు రాష్ట్రాలు తదుపరి నిర్ణయం తీసుకోబోతున్నాయి.
