Home తెలంగాణ అనిరుధ్ రెడ్డి: బిల్లుల కోసం ఆమరణ దీక్షకు సిద్ధమైన కాంగ్రెస్ – Andhra Waves

అనిరుధ్ రెడ్డి: బిల్లుల కోసం ఆమరణ దీక్షకు సిద్ధమైన కాంగ్రెస్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


అనిరుధ్ రెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మీడియాకు పండగే పండుగ. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు నిత్యం అసంతృప్తితో ఉంటారు. పదవులు దక్కిన వారు ఆనందంతో ఉంటే.. పదవులు రానివారు అధిష్టానం మీద ఎర్రజెండా ఎగరేస్తుంటారు. నిత్యం అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసంతృప్తికి కొదవలేదు. ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని కొందరు ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్నారు. […]

అనిరుధ్ రెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మీడియాకు పండగే పండుగ. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు నిత్యం అసంతృప్తితో ఉంటారు. పదవులు దక్కిన వారు ఆనందంతో ఉంటే.. పదవులు రానివారు అధిష్టానం మీద ఎర్రజెండా ఎగరేస్తుంటారు. నిత్యం అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసంతృప్తికి కొదవలేదు. ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని కొందరు ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తమ స్థాయికి మించి ఆరోపణలు చేస్తున్నారు. ఈ జాబితాలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యే. ఈయన నిత్యం వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణకు వస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

ఇప్పుడు తాజాగా అనిరుద్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నారు. దీనికి కారణం తన నియోజకవర్గంలో నిలిచిపోయిన రోడ్ల.. నిలిచిపోయిన బిల్లుల విడుదల వ్యవహారం.. అనిరుద్ రెడ్డి జరుగుతున్న జడ్చర్ల నియోజకవర్గంలో రాజాపూర్ మండల పరిధిలోని అనేక గ్రామాల నిర్మాణం జరిగింది. అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించి నిధుల విడుదల కోసం ఏకంగా 30 వేల మందితో కలిసి ఆమరణ దీక్షకు దిగుతానని ప్రకటించారు.

సచివాలయం.. ప్రభుత్వ శాఖల అధికారుల పనితీరుపై ఆయన ఆరోపణలు చేశారు. నిధుల విడుదల విషయంలో తీవ్ర స్థాయిలో వివక్ష కొనసాగుతుందని. మంత్రుల నియోజకవర్గం మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని.. బిల్లులు మిగిలిన ఎమ్మెల్యేలు ఏం చేయాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇటీవల ఓ కాంట్రాక్టర్ చనిపోయారని.. దీంతో ఐదు కోట్ల బిల్లు ఇచ్చారు.. అలాంటప్పుడు తన నియోజకవర్గంలో చనిపోతానని.. అప్పుడు బిల్లు చేస్తారా అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. 40 కోట్ల బిల్లులు ముఖ్యమైనవా.. తన ప్రాణం ముఖ్యమా.. ప్రభుత్వం తేల్చుకోవాలని సవాల్ విసిరారు.

తన నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం మీద ప్రజలు నిలదీస్తున్నారని.. వాళ్లకు ఏం సమాధానం చెప్పలేకపోతున్నానని అనిరుద్ రెడ్డి. మంత్రులను తీసుకొచ్చి హామీలు ఇచ్చినప్పటికీ.. అవి కార్యరూపం దాల్చలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. భట్టి విక్రమార్క ను కలిసినట్లు.. వారు హామీలిచ్చారని.. ఇంతవరకు పైసా విడుదల చేయలేదని అనిరుద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆవేదనను అర్థం చేసుకొని ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని.. లేనిపక్షంలో గాంధీభవన్ లేదా ప్రజల ముందు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఆయన సంకేతాలు పంపించారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird