Home Latest News భారతీయ వంటింటి అమృతం.. కొబ్బరి ప్రాముఖ్యత, ఆసక్తికరమైన విషయాలు..! | కొబ్బరికాయ భారతీయ వంటశాలల మకరందం ప్రాముఖ్యత మరియు ఆసక్తికరమైన వాస్తవాలు – Andhra Waves

భారతీయ వంటింటి అమృతం.. కొబ్బరి ప్రాముఖ్యత, ఆసక్తికరమైన విషయాలు..! | కొబ్బరికాయ భారతీయ వంటశాలల మకరందం ప్రాముఖ్యత మరియు ఆసక్తికరమైన వాస్తవాలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
భారతీయ వంటింటి అమృతం.. కొబ్బరి ప్రాముఖ్యత, ఆసక్తికరమైన విషయాలు..! | కొబ్బరికాయ భారతీయ వంటశాలల మకరందం ప్రాముఖ్యత మరియు ఆసక్తికరమైన వాస్తవాలు


భారతీయ వంటింట్లో కొబ్బరి ప్రధాన ఆహార పదార్థం. కూరలో వేయడమే కాకుండా పచ్చళ్ళు, పొడులు, స్వీట్లు.. ఇలా చాలా రకాలుగా కొబ్బరిని వినియోగిస్తారు. ఆరోగ్యం కోసం ప్రకృతి అందించిన అమృతంగా కొబ్బరిని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా కోకోనట్ డే లేదా ప్రపంచ కొబ్బరి దినోత్సవం జరుపుకుంటారు. ఆసియా-పసిఫిక్ కొబ్బరి కమ్యూనిటీ స్థాపించిన ఈ రోజును పురస్కరించుకుని 2009వ సంవత్సరం నుండి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రాముఖ్యతను తెలుసుకోవడం, దాని కొబ్బరి సాగు, అలాగే ఆర్థిక వ్యవస్థలో దాని పాత్రపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించడం ప్రపంచ కోకోనట్ డే ప్రధాన ఉద్దేశం. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

కొబ్బరి చారిత్రక , సాంస్కృతిక ప్రాముఖ్యత..

భారతీయ సంస్కృతిలో , సనాతన సంప్రదాయంలో కొబ్బరికాయకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. అందుకే దీనిని కల్పవృక్షంతో సమానంగా పిలుస్తారు. కల్పవృక్షం అంటే అడిగిన కోరికలన్నీ తీర్చే చెట్టు అని అర్థం. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. ఆకుల నుండి పీచు వరకు, కొబ్బరి నీళ్ల నుండి కొబ్బరి నూనె వరకు అన్నీ మానవాళికి మేలు చేసేవే. భారతీయులు పూజలు, వ్రతాలు, శుభకార్యాలు, , కొత్త పనులు మొదలు పెట్టేముందు కొబ్బరికాయ కొట్టడం శుభసూచకంగా భావిస్తున్నారు. శ్రీఫలం అని పిలిచే ఈ కొబ్బరి దైవిక శక్తికి , పవిత్రతకు ప్రతీక.

రైతుల జీవితాల్లో , ఆర్థిక వ్యవస్థలో కొబ్బరి పాత్ర..

కొబ్బరి కేవలం ఒక ఫలం మాత్రమే కాదు, లక్షలాది మంది రైతుల జీవనాధారం. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం కొబ్బరి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి తీరప్రాంత రాష్ట్రాల్లో కొబ్బరి సాగు విస్తృతంగా జరుగుతుంది. కొబ్బరి ఆధారిత పరిశ్రమల ద్వారా కోట్లాది మందికి ఉపాధి లభిస్తోంది. కొబ్బరి నూనె తయారుచేసే మిల్లులు, పీచుతో తయారు చేసే మ్యాట్లు, తాళ్లు, కంపోస్ట్ మందులు, కొబ్బరి చిప్పలతో చేసే హస్తకళల ద్వారా ఎంతోమంది స్వయం ఉపాధి పొందుతున్నారు. అంతర్జాతీయంగా కొబ్బరి పదార్థాలు ఎగుమతి వల్ల మన దేశానికి భారీగా విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది.

ఆరోగ్య ప్రయోజనాల నిధి..

ఆరోగ్య పరంగా కొబ్బరి అందించే మేలు అపారమైనది. నేటి ఆధునిక జీవనశైలిలో ఏర్పడిన అనేక ఆరోగ్య సమస్యలకు కొబ్బరి ఒక సహజమైన పరిష్కారంగా నిలుస్తుంది. లేత కొబ్బరి నీళ్లు ప్రకృతి అందించిన సహజమైన ఎనర్జీ డ్రింక్. ఇందులో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. వేసవిలో లేదా నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడటంతో పాటు శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతుంది.

కొబ్బరి నూనె..

కొబ్బరి నూనెను కేవలం వంటలకే కాకుండా ఆయుర్వేదంలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే లారిక్ యాసిడ్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొబ్బరి నూనె చర్మాన్ని మృదువుగా ఉంచడానికి, జుట్టు ఎదుగుదలకు, గాయాలు మానడానికి బాగా తోడ్పడుతుంది.

పచ్చి కొబ్బరి..

పచ్చి కొబ్బరిలో మంచి కొవ్వులు, పీచు పదార్థం , విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది , జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. బరువు తగ్గాలంటే వారికి కూడా కొబ్బరి మితంగా తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

పర్యావరణ పరిరక్షణలో కొబ్బరి..

ప్రస్తుతం ప్రపంచంలోని ప్రధాన సమస్య ప్లాస్టిక్ కాలుష్యం. ఈ సమస్యకు కొబ్బరి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. కొబ్బరి పీచు , చిప్పలతో తయారుచేసే ఉత్పత్తులు పర్యావరణానికి ఎలాంటి హాని చేయవు. ఇవి త్వరగా మట్టిలో కలసిపోతాయి. కొబ్బరి పీచును కోకో పీట్ అని పిలుస్తారు. దీన్ని మొక్కల పెంపకంలో నీటిని పట్టి ఉంచేందుకు ఉపయోగిస్తారు. దీనివల్ల నీటి వినియోగం తగ్గుతుంది.

వరల్డ్ కోకోనట్ డే అనేది కొబ్బరి చెట్టు మనకు ఎన్నో ప్రయోజనాలను గుర్తుచేసుకునే గొప్ప రోజు. సహజసిద్ధమైన కొబ్బరి ఉత్పత్తులను మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, కొబ్బరి సాగుపై రైతులకు, చిన్న తరహా పరిశ్రమలకు మద్దతుగా నిలిచినవారమవుతాం.

రూపశ్రీ.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird