Home Latest News రామాంతపూర్‌లో భారీ పేలుడు..స్క్రాప్ షాప్ యజమానికి తీవ్ర గాయాలు.! | రామంతపూర్ పేలుడు | స్క్రాప్ షాప్ పేలుడు | హైదరాబాద్ వార్తలు | చర్చి కాలనీ అగ్ని ప్రమాదం | స్క్రాప్ డీలర్ గాయపడ్డాడు | గాంధీ హాస్పిటల్ | తెలుగు వన్ – Andhra Waves

రామాంతపూర్‌లో భారీ పేలుడు..స్క్రాప్ షాప్ యజమానికి తీవ్ర గాయాలు.! | రామంతపూర్ పేలుడు | స్క్రాప్ షాప్ పేలుడు | హైదరాబాద్ వార్తలు | చర్చి కాలనీ అగ్ని ప్రమాదం | స్క్రాప్ డీలర్ గాయపడ్డాడు | గాంధీ హాస్పిటల్ | తెలుగు వన్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది. చర్చ్ కాలనీలో ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దుకాణ యజమాని, స్క్రాప్ డీలర్ పరశురామ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానిక భయాందోళనకు గురయ్యారు.

లోహాన్ని కట్ చేస్తుండగా పేలుడు.!

స్క్రాప్ దుకాణంలో లోహపు వ్యర్థాలను కట్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పరశురామ్ శరీరానికి సుమారు 70 శాతం కాలిన గాయాలైనట్లు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.!

ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకున్నారు. పేలుడు కారణంగా చుట్టుపక్కల ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.

పేలుడుకు కారణమేంటి.?

ఈ భారీ పేలుడు ఎందుకు సంభవించిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. లోహాలను కట్ చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ లేదా ఇతర ప్రమాదకర పదార్థాల కారణంగా పేలుడు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. పేలుడుకు అసలు కారణం అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

జనావాసాల మధ్య ఉన్న స్క్రాప్ దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, భద్రతా లోపాలపై అధికారులు దర్యాప్తు చేపడితే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

[ Ramanthapur explosion, scrap shop blast, Hyderabad news, Church Colony fire accident, scrap dealer injured, Gandhi Hospital, Telugu One, Telugu News ]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird