Home Latest News Eshwar Sai : తప్పు ఒప్పుకున్న బాసింగ బలాలు ఈశ్వర్.. – Andhra Waves

Eshwar Sai : తప్పు ఒప్పుకున్న బాసింగ బలాలు ఈశ్వర్.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Eshwar Sai : ఇటీవల వేములవాడలో హోటల్‌లో మాధురి రాథోడ్ అనే యువతితో తన భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు ప్రముఖ జానపద గేయాల డాన్సర్ ఈశ్వర్ సాయి. ఈ ఘటన తర్వాత అతడి గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్ ను పట్టుకున్న తర్వాత అతడి భార్య మాధురి మీద దాడి చేసింది. తీవ్రంగా కొట్టింది. ఈ ఘటన తర్వాత విలేకరుల సమావేశంలో ఈశ్వర్ సాయి […]

Eshwar Sai : ఇటీవల వేములవాడలో హోటల్‌లో మాధురి రాథోడ్ అనే యువతితో తన భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు ప్రముఖ జానపద గేయాల డాన్సర్ ఈశ్వర్ సాయి. ఈ ఘటన తర్వాత అతడి గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్ ను పట్టుకున్న తర్వాత అతడి భార్య మాధురి మీద దాడి చేసింది. తీవ్రంగా కొట్టింది.

ఈ ఘటన తర్వాత విలేకరుల సమావేశంలో ఈశ్వర్ సాయి భార్య మాట్లాడారు. తన భర్త అటువంటివాడు కాదని.. కనీసం అతడు మద్యం కూడా తాగడని.. అతడిని మాధురి రాథోడ్ పూర్తిగా మార్చేసిందని ఆరోపించింది. ఆ తర్వాత రెండు రోజులకే ఆమె మళ్లీ తన స్వరాన్ని మార్చుకుంది.. మాధురి రాథోడ్.. ఈశ్వర్ సాయిని మీడియా వదిలేయాలని.. వారిద్దరిమీద ఇప్పటివరకు ప్రసారం చేసిన కథనాలను మొత్తం డిలీట్ చేయడం మొదలుపెట్టింది.. వారిద్దరి ప్రేవసికి మీడియా గౌరవం అందించాలని కోరింది.. చేసింది మొత్తం తర్వాత.. జరగాల్సింది మొత్తం జరిగింది.

ఇప్పుడు ఈశ్వర్ సాయి తెరమీదికి వచ్చాడు. భార్య ఉన్న తర్వాత తాను ఇలా చేయడం కాదని అతడు అంగీకరించాడు. తాను చేసింది తప్పు అని ఒప్పుకున్నాడు. తనకు అలాంటి పరిస్థితి ఒత్తిడి వల్ల వచ్చిందని చెప్పాడు. అనేక రకాల కారణాల వల్ల తాను ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. మరోవైపు ఈశ్వర్ సాయి భార్య దాడి చేసిన నేపథ్యంలో మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేములవాడ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఈశ్వర్ సాయి భార్య మీద ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేశారు.

ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్ అనేక విజయవంతమైన పాటలలో నటించారు. వీరిద్దరూ నటించిన పాటలు యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. వీరిద్దరికీ ఫోక్ ఇండస్ట్రీలో సూపర్ జోడి అనే పేరు ఉంది. గతంలో మాధురి రాథోడ్ ఒక యువకుడిని ప్రేమించింది. చాలా రోజులపాటు వీరి వ్యవహారం సాగింది. ఆ తర్వాత బ్రేకప్ అయింది. అప్పుడు ఈశ్వర్ సాయి భార్య ఆమెకు అండగా నిలిచింది. ఇంట్లో సభ్యురాలిగా ట్రీట్ చేసింది. అయితే ఆ తర్వాత ఈశ్వర్ సాయిని మాధురి రాథోడ్ బుట్టలో వేసుకుందని.. ఆమె ఆరోపించింది. ఇటీవల మాధురి రాథోడ్.. ఈశ్వర్ సాయి కదలికల మీద దృష్టి పెట్టింది. చివరికి వారిద్దరిని దొరక్క పట్టింది. ఫలితంగా ఈ వ్యవహారం ఇక్కడి వరకు వచ్చింది.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird