Home సినిమా రవితేజ: రవితేజ తులాభారం.. బూతులకు బీఫ్ సౌండ్లు – Andhra Waves

రవితేజ: రవితేజ తులాభారం.. బూతులకు బీఫ్ సౌండ్లు – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


రవితేజ: ఇరుముడి సినిమా గ్రాండ్ సక్సెస్ తర్వాత మాస్ మహారాజా రవితేజ వివేక్ ఆత్రేయకు అవకాశం ఇచ్చారు. ఈ సినిమాకు తులాభారం అని పేరు పెట్టారు. వివేక్ ఆత్రేయకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. నానితో తీసిన శనివారం సినిమాతో తన రేంజ్ ఏమిటో చూపించాడు. వివేక్ ఆత్రేయ తీసే సినిమాలలో క్లాస్ స్టైల్ లో హ్యూమర్ ఉంటుంది. అత్రేయ తీసిన లోగడ సినిమాలను చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు వివేక్ మాస్ మహారాజాతో కలిసి తులాభారం […]

రవితేజ: ఇరుముడి సినిమా గ్రాండ్ సక్సెస్ తర్వాత మాస్ మహారాజా రవితేజ వివేక్ ఆత్రేయకు అవకాశం ఇచ్చారు. ఈ సినిమాకు తులాభారం అని పేరు పెట్టారు. వివేక్ ఆత్రేయకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. నానితో తీసిన శనివారం సినిమాతో తన రేంజ్ ఏమిటో చూపించాడు.

వివేక్ ఆత్రేయ తీసే సినిమాలలో క్లాస్ స్టైల్ లో హ్యూమర్ ఉంటుంది. అత్రేయ తీసిన లోగడ సినిమాలను చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు వివేక్ మాస్ మహారాజాతో కలిసి తులాభారం అనే సినిమాను చిత్రీకరిస్తున్నాడు. టైటిల్ కూడా తెలుగుదనం ఉట్టిపడే విధంగా ఉంది.. వివేక్ తీసిన సినిమాలకు సంబంధించిన టైటిల్స్ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. బ్రోచేవారు ఎవరు రా.. మెంటల్ మదిలో.. అంటే సుందరానికి.. సరిపోతా శనివారం ఇబ్బంది కూడా అద్భుతమైన పేర్లు. తుల భారాన్ని కూడా అందులోకి తీసుకెళ్లాడు.

తులాభారానికి సంబంధించిన డాక్యుమెంటరీ పేరుతో చిన్నపాటి గ్లిమ్స్ ఆదివారం విడుదల చేశారు. సినిమా కాన్సెప్ట్ ఏంటో.. ప్రధాన పాత్రలు ఎలా ఉంటాయో.. చివరికి మాస్ మహారాజా సినిమా టైటిల్ మీద హ్యూమర్ టచ్ ఉండేలా పంచ్ వేయడం కుదిరింది. ఇంతవరకు బాగానే బూతులు బీభత్సంగా ఉన్నాయి. రెండు చోట్ల సౌండ్ కూడా వచ్చేసింది. రవితేజ ఎటువంటి బూతులు లేకుండా ఇరుముడి సినిమాలో నటించారు. ఆ సినిమా మామూలు విజయాన్ని అందించలేదు. ఒక ముక్కలో చెప్పాలంటే రవితేజ సినిమా ఎలా ఉండాలో ఇరుముడి నిరూపించింది. కానీ ఇందులో మాత్రం బూతులు బూతులు అనే విధంగానే ఉంది. రవితేజ సినిమా కాబట్టి బూతులు ఉండాల్సిందేనా.. ఆ స్థాయిలో డోసు కనిపించాల్సిందేనా..

వివేక్ గత సినిమాలను గమనించే అందులో ఏమాత్రం బూతులు ఉండవు. పైగా హ్యూమర్ టచ్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం పంటికిందరాయిలాగా బూతులు తగిలే అవకాశం ఉంది. అలాంటి వాటిని క్లాస్ ఆడియన్స్ భరిస్తారా.. క్లాస్ ఆడియన్స్ రావడం వల్లే కదా ఇరుముడి ఈ స్థాయిలో విజయం సాధించింది. అలాంటప్పుడు మళ్లీ తన పాత ధోరణిలోకి రవితేజ వెళ్తారంటే చేసేది ఏమీ ఉండదు. క్రాక్, ధమాకా తర్వాత దాదాపు అరడజనుకు మించి ప్లాపులను మూటకట్టుకోవాల్సి వచ్చింది. ఇరుముడి దాకా రవితేజ సినిమాలకు సరైన మార్కెట్ కూడా లేదు. చివరికి ఇరుముడి సినిమాకు ఆయన పారితోషికం తీసుకోకుండానే నటించాల్సి వచ్చింది. నైజాం హక్కులను దక్కించుకోవడం ద్వారా బయటపడ్డారు రవితేజ.

ఇది శాంపిల్ మాత్రమే. శాంపిల్ కాబట్టి ఇలా చేశారనుకుంటే ఓకే. ఇదే కంటిన్యూ అయితేమాత్రం సినిమా మొత్తం చూస్తే ప్రేక్షకులు చికాకు పడక తప్పదు. పైగా ఇరుముడి లాంటి సక్సెస్ తరువాత అంతకుమించిన సినిమా తీయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా రవితేజ గ్రాఫ్ పడిపోతుంది. ఈ సినిమాలో ప్రియాంక అరుణ్ మోహన్.. జెడి చక్రవర్తి.. తరుణ్ భాస్కర్.. అనస్వర రాజన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. వివేక్, భీమ్స్ సిసిరోలియా మ్యూజిక్ అందించారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird