తమిళ సినీ పరిశ్రమలో మరో స్టార్ హీరో రాజకీయాల్లోకి వస్తారనే చర్చ మొదలైంది. నటుడు ధనుష్ రాజకీయ రంగప్రవేశంపై వస్తున్న ఊహాగానాలపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రతిపక్షని తమిళగ వెట్రి కళగం (టీవీకే) స్పందించింది. ధనుష్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే స్వాగతిస్తామని పార్టీ ప్రతినిధి ఎం. సత్య కుమార్ తెలిపారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి విజయ్ సాధించిన ప్రస్థానం ఇతరులకు స్ఫూర్తిగా నిలవడం తనకు సంతోషంగా ఉందని ఆయన ఏనాడైనా.
ఇటీవల ధనుష్ తన అభిమాన సంఘం పేరును ‘ధనుష్ నర్పణి మండ్రం’ నుంచి ‘ధనుష్ నరపణి ఇయక్కం’గా మార్చారు. అంటే ధనుష్ సంక్షేమ ఉద్యమం అని అర్థం. కోయంబత్తూరులో నిర్వహించిన సమావేశానికి సుమారు 3,000 మంది అభిమాన సంఘం ప్రతినిధులు. ప్రజాసేవ, క్రమశిక్షణ, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో ధనుష్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
ఈ సందర్భంగా టీవీ ప్రతినిధి మాట్లాడుతూ.. రాజకీయ పార్టీని స్థాపించడం ఒక సవాల్ అయితే, దాన్ని విజయవంతంగా నడిపించి ప్రజల మద్దతు పొందడం మరో పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. విజయ్ తన సినీ కెరీర్ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే నటనకు స్వస్తి చెప్పి పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి సారించారని, ఆ ప్రయాణం అంత సులభంగా సాగలేదని వివరించారు. విజయవంతం కావాలంటే పూర్తి సమయం కేటాయించడంతో పాటు ప్రజల మధ్య నిరంతరం పనిచేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
అయితే, ధనుష్ ఇప్పటివరకు తన రాజకీయ ప్రవేశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అభిమాన సంఘం పేరులో మార్పు, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టడం వంటి పరిణామాలు ప్రస్తుతం ఈ ఊహాగానాలకు కారణమయ్యాయి. మరోవైపు, ధనుష్ రాజకీయాల్లోకి వస్తే తమ పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు అన్నాడీఎంకే నేతలు గతంలో కూడా. మరి ధనుష్ నిజంగానే రాజకీయాల్లోకి వస్తారా? లేక అభిమాన సంఘాన్ని ప్రజాసేవ కార్యక్రమాలకే పరిమితం చేస్తారా? అన్నది వేచి చూడాలి.
[Dhanush Politics Entry, Dhanush News, Vijay TVK Party, Dhanush Narpani Iyakkam, M Sathya Kumar, Tamil Nadu Politics, Dhanush Fan Association, Dhanush Political News]
