Home క్రైమ్ Mancherial News: గణేష్ నిమజ్జనంలో మరో మహిళతో భర్త డ్యాన్స్.. – Andhra Waves

Mancherial News: గణేష్ నిమజ్జనంలో మరో మహిళతో భర్త డ్యాన్స్.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Mancherial News: గణపతి నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చివరి రోజు నిమజ్జనాన్ని అదే స్థాయిలో నిర్వహించారు. పాటలతో.. డ్యాన్సులతో ఆకట్టుకున్నారు. ఊరు ఊరు మొత్తం వారి సందడి చూసి హోరెత్తిపోయింది. ఆశేషమైన జనవాహిని మధ్య గణనాయకుడిని ఘనంగా గంగమ్మ ఓడికి చేర్చారు. ఇంతవరకు బాగానే వేడుక గణపతి నిమజ్జనలో జరిగిన ఒక సంఘటన ఒక కుటుంబంలో విషాదం నింపింది. ఒక మహిళ తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని కన్నీటి పర్యంతం చేసింది. గణేష్ […]

మంచిర్యాల వార్తలు: గణపతి నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చివరి రోజు నిమజ్జనాన్ని అదే స్థాయిలో నిర్వహించారు. పాటలతో.. డ్యాన్సులతో ఆకట్టుకున్నారు. ఊరు ఊరు మొత్తం వారి సందడి చూసి హోరెత్తిపోయింది. ఆశేషమైన జనవాహిని మధ్య గణనాయకుడిని ఘనంగా గంగమ్మ ఓడికి చేర్చారు.

ఇంతవరకు బాగానే వేడుక గణపతి నిమజ్జనలో జరిగిన ఒక సంఘటన ఒక కుటుంబంలో విషాదం నింపింది. ఒక మహిళ తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని కన్నీటి పర్యంతం చేసింది. గణేష్ నిమజ్జన వేడుకల్లో భర్త మరో మహిళతో కలిసి డ్యాన్స్ చేశాడని ఒక మహిళ మనస్థాపానికి గురైంది. పరుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లా కాజీపేట మండలం దొడ్డి గూడ ప్రాంతంలో జరిగింది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం దొడ్డి గూడ గ్రామానికి చెందిన సంధ్య కు జగ్గు అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఇటీవల గణేష్ నిమజ్జన వేడుకలను ఇక్కడ నిర్వహించారు. ఈ వేడుకల్లో జంగు పాల్గొన్నారు. ఆ సమయంలో మరో మహిళతో కలిసి అతడు డ్యాన్స్ చేశాడు. తన భర్త వేరొక మహిళతో కలిసి డ్యాన్స్ చేయడానికి సంధ్య తట్టుకోలేకపోయింది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ విషయం గురించి రకరకాలుగా మాట్లాడుకోవడంతో ఆమె మరింత కలత చెందింది. వెంటనే పురుగుల మందు తాగింది.

ఆమెను స్థానికంగా ఉన్న వైద్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు చికిత్స అందించారు పరిస్థితి విషమించింది. దీంతో సంధ్య చనిపోయింది గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన ఒక సాధారణ వేడుక చివరికి ఒక కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. సంధ్య మృతితో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. అయితే సంధ్య ఇలా చేయడానికి మరో మహిళతో కలిసి తన భర్త డ్యాన్స్ చేయడమేనా.. ఇంకా ఏదైనా కారణం ఉందా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరో వైపు కుటుంబ సభ్యులు చెబుతున్న కారణాన్ని పోలీసులు దృవీకరించాల్సి ఉంది. నిజానికి గణేష్ నిమజ్జనం అనేది ఆనందంగా సాగిపోవాలి. సామూహికంగా జరిగిపోవాలి. కానీ ఒక చిన్న సంఘటన కూడా ఇంతటి విషాదానికి దారి తీయడం ఆందోళన కలిగిస్తోంది.. సంధ్య తీసుకున్న నిర్ణయం కుటుంబాన్నికన్నీటి సంద్రంలో ముంచిందని చుట్టు పక్కల వారు చర్చించుకుంటున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird