కవిత:రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో కొంగర కురుదు ఏ గ్రామంలో భూ వివాదం చోటు చేసుకుంది. ఇది కాస్త రాజకీయరణరంగంలా మారిపోయింది. గులాబీ పార్టీ కీలక నేతల ప్రమేయంతో నాడు ఈ భూముల్లో లే అవుట్లు వేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు రైతులతో కలిసి తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత విలేకరుల సమావేశం నిర్వహించారు. సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు ఈ వ్యవహారంలో మీడియా సంస్థల మీద కూడా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు.
ముందుగా సాక్షి.. ఆ తర్వాత నమస్తే తెలంగాణ
ఇక్కడి భూముల వ్యవహారంపై ముందుగా సాక్షి.. ఆ తర్వాత నమస్తే తెలంగాణలో కథనాలు వచ్చాయి. ఈ పద్య కవిత ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే మరుసటి రోజు ఈ కథనం మీద నమస్తే తెలంగాణ మౌనం పాటించింది. సాక్షి మాత్రం బాధిత రైతులకు అనుకూలంగా కాకుండా.. వ్యతిరేకంగా కథలను ప్రచురించింది. దీంతో ఈ రెండు మీడియా సంస్థల మధ్య అవగాహన ఉన్నట్టుగా కవిత అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే నేపథ్యంలో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రామన్న.. జగనన్న.. కొత్తగా స్నేహితులయ్యారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీసాయి. కేటీఆర్.. జగన్ మధ్య చాలా కాలంగా స్నేహ సంబంధాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో గులాబీ పార్టీ జగన్ కు సహకరించినట్లు అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి.
అధికారుల అండదండలతో
కలెక్టరేట్ కు అత్యంత దగ్గరగా ఉన్న ఈ భూములు విలువైనవి.. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలంగా ఈ ప్రాంతం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారుల అండదండలతో ఈ భూములను సొంతం చేసుకునేందుకు ప్రయత్నించారు. స్థానికంగా ఉన్న రైతులు ఇక్కడ సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ భూములకు నకిలీ రికార్డులు సృష్టించారు. వారి హక్కులను నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పేద రైతుల భూములను కాపాడాల్సిన పాలసీ ఈ వ్యవహారంలో చూసి చూడనట్టు ఉండటం పట్ల కవిత కనిపించింది.
వైద్య చికిత్స విఫలం
1954 -55 ఖాస్రా పహాణి రికార్డుల ప్రకారం పేదలకు సంబంధించిన పట్టా, ఇనామ్, జాగిద్దారి భూములను పరిరక్షించడంలో కొనుగోలు విఫలమైంది. ఈ భూముల్లో కొంత భాగం నిషేధిత జాబితా కోట్ల రూపాయల విలువైన బూదండకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసలైన రైతుల పట్టా భూములను కూడా ఫోర్జరీ పత్రాలతో ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన బద్దవని కవిత బయటపెట్టారు.
హైకోర్టు స్టే ఉత్తర్వులు
ఇక్కడ భూములకు సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చింది. అయినప్పటికీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో నియామకాలు.. లే అవుట్లకు అనుమతులు ఎలా ఇస్తున్నారని కవిత ప్రస్తావించారు. కలెక్టరేట్ ఎదుట 100 అడుగుల రోడ్డు కోసం ఈ భూమిని కేటాయించినట్లు చెబుతున్న సర్వే నెంబర్ 85 లోని ప్రభుత్వ భూమికి కూడా నకిలీ ఓఆర్సీ ద్వారా ప్రైవేట్ వెంచర్లో కలిపే ప్రయత్నం జరిగిన కవిత సంచలన నిజాలను బయటపెట్టారు. ఈ స్థాయిలో భూ దందా జరుగుతుంటే అధికారులు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని కవిత ప్రశ్నించారు.
ఈ భూమి వివాదంలో కబ్జాకు వచ్చింది ఎవరో తనకు తెలుసునని కవిత చెప్పడం సంచలనంగా మారింది. ఆ పేర్లను బయట పెట్టడం తన ఉద్దేశం కాదని.. బాధిత రైతులకు న్యాయం జరగడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఇక్కడ రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆమె ప్రకటించారు.. ఈ వివాదంపై ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ వ్యవహారంపై అధికారికంగా ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు.
అయితే ఈ భూ వివాదం ఇప్పుడు కేవలం రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య కాకుండా.. రాజకీయంగా.. మీడియా సంబంధిత కోణాలను కూడా సంతరించుకోవడం విశేషం. భూములకు సంబంధించిన నకిలీ పత్రాలు.. ఓ ఆర్సీలు.. ఒప్పందాలపై ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై వివిధ మీడియా సంస్థలు వ్యవహరించిన తీరు కూడా ఆందోళన కలిగిస్తుంది.. అయితే కల్వకుంట్ల కవిత చేసిన భూకబ్జా.. నకిలీ పత్రాలు.. అధికారుల ప్రమేయం
