Home తెలంగాణ Revanth Reddy: కరువు కాలంలో రేవంత్ ఢిల్లీ బాట.. తెలంగాణ – Andhra Waves

Revanth Reddy: కరువు కాలంలో రేవంత్ ఢిల్లీ బాట.. తెలంగాణ – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Revanth Reddy: భారత రాష్ట్ర సమితి చెప్పినట్టుగానే.. ఆరోపించినట్లుగానే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారేమో అనిపిస్తుంది. పదేపదే అవే తప్పులు.. గులాబీ పార్టీ సోషల్ మీడియాలో విపరీతంగా నెగటివ్ ప్రచారం చేసినప్పటికీ.. సొంత మీడియాలో రకరకాల భాష్యాలు చేసినా రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోవడం లేదు. పైగా గులాబీ పార్టీకి అవకాశం ఇచ్చే విధంగా నడుచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది రాష్ట్రంలో తెలంగాణ అత్యంత కీలకమైనది. ఇక్కడ మళ్లీ అధికారంలోకి రావాలంటే ప్రజలు మెచ్చుకునే విధంగా […]

రేవంత్ రెడ్డి: భారత రాష్ట్ర సమితి చెప్పినట్టుగానే.. ఆరోపించినట్టుగానే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారేమో అనిపిస్తుంది. పదేపదే అవే తప్పులు.. గులాబీ పార్టీ సోషల్ మీడియాలో విపరీతంగా నెగటివ్ ప్రచారం చేసినప్పటికీ.. సొంత మీడియాలో రకరకాల భాష్యాలు చేసినా రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోవడం లేదు. పైగా గులాబీ పార్టీకి అవకాశం ఇచ్చే విధంగా నడుచుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది రాష్ట్రంలో తెలంగాణ అత్యంత కీలకమైనది. ఇక్కడ మళ్లీ అధికారంలోకి రావాలంటే ప్రజలు మెచ్చుకునే విధంగా పనులు చేయాలి. గులాబీ పార్టీని అన్ని రకాలుగా కార్నర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ అధికంగా ఉంటుంది. సెంటిమెంట్ లోబడి రాజకీయాలు చేయాలి. అదే సమయంలో ప్రజల సంక్షేమాన్ని.. అభివృద్ధిని కొనసాగించాలి. కానీ ఈ విషయంలో ఇటీవల కాలంలో సీఎం వేగవంతంగా చర్యలు తీసుకోబడ్డాయి.

మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే విషయంలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి విమర్శలకు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన కౌంటర్ రాలేదు. మేడిగడ్డ ఎత్తిపోతల పథకానికి సంబంధించి రిపేర్ ఇప్పుడు సాధ్యమవుతుందా.. ఇంకెన్ని రోజులు పడుతుంది అనే విషయం మీద ఇంతవరకు ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు. ఇక విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండటంతో.. దానికి తగ్గట్టుగా సరఫరా కూడా లేదు. దేశం మొత్తం కరువు ఉంది. కాదనలేని వాస్తవం. కానీ కరువు తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి కూడా చర్యలు ఉండాలి కదా.. ఆ విషయంలో సీఎం విఫలం అని చెప్పవచ్చు. ఇటీవల సోమవారం కరువు మీద సమీక్ష నిర్వహించామని సీఎంఓ ఆఫీస్ నుంచి మీడియాకు సమాచారం అందించారు. కానీ ఆ సమాచారానికి సీఎంతో సహా మంత్రులు మొత్తం డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేయడంతో మొదలుపెడితే ఎమ్మెల్యేల వరకు అందరూ ముఖ్యమంత్రి ఢిల్లీ బాట పట్టారు. అక్కడ జరిగిన ఆందోళనలో.

కరువు మీద సమీక్ష నిర్వహించామని చెప్పి.. అప్పటికప్పుడు ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల వరకు ఢిల్లీ బాట పడితే ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటి.. ఓట్లు వేసి గెలిపించిన తెలంగాణను ఇలా అన్యాయం చేస్తారా.. అంటూ గులాబీ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. సొంత మీడియాలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కరువు పరిస్థితులను ఏ కరువు పెడుతున్నారు. ఆంధ్రా ప్రాంతం తెలంగాణ నుంచి నీళ్లను దోచుకుని పోయారని.. కనీసం మేడిగడ్డ నుంచి నీళ్లను ఎత్తిపోసే సోయి ప్రభుత్వానికి లేదని.. ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని గులాబీ నేతలు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఈ విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకుల వద్ద సమాధానం లేదు. అప్పటికప్పుడు సమావేశం పెట్టి.. ఆ తర్వాత సమావేశాన్ని రద్దు చేస్తామని ప్రకటించడం నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఢిల్లీ రాజకీయాలకు నిదర్శనమని గులాబీ నేతలు విమర్శిస్తున్నారు..

కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులకు ఏ స్థాయి విలువ ఉంటుందో ఇటీవల డీకే శివకుమార్ ఉదంతం నిరూపించింది. తెలంగాణ నుంచి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దగా అక్కడ గౌరవం లభించలేదని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టి.. ఢిల్లీలో అధిష్టానం సేవ చేయడానికి నాయకులు వెళ్లిన తీరును చూస్తే అసహ్యం వేస్తోందని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాంటి సమాధానం చెప్తారు.. కరువును ఎలా ఎదుర్కొంటారు.. అనేది చూడాల్సి ఉంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird