Home Latest News మెడ 180 డిగ్రీలు: ఇవే తగ్గించుకోవాలి.. మెడను 180 డిగ్రీలు – Andhra Waves

మెడ 180 డిగ్రీలు: ఇవే తగ్గించుకోవాలి.. మెడను 180 డిగ్రీలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


మెడ 180 డిగ్రీలు: ఇప్పటి కాలంలో మనం ఫోన్ విపరీతంగా చూస్తూ ఉన్నాం. అదే పనిగా ఫోన్ చూస్తే మెడ నొప్పి పుట్టడం ఖాయం. పైగా మెడ ప్రాంతంలో సున్నితమైన రక్తనాళాలు ఉంటాయి. వీటి మీద ఏదైనా ఒత్తిడి పడితే.. అది మొత్తంగా మన దేహం మీద ప్రభావం చూపుతుంది. మెడ నొప్పులు.. దృష్టి సంబంధిత సమస్యలు.. తల సంబంధిత సమస్యలు అనేకం వస్తూ ఉంటాయి. మన దేహంలో అత్యంత సున్నితమైన రక్తనాళాలు ఉండే ప్రాంతం […]

మెడ 180 డిగ్రీలు: ఇప్పటి కాలంలో మనం ఫోన్ విపరీతంగా చూస్తూ ఉన్నాం. అదే పనిగా ఫోన్ చూస్తే మెడ నొప్పి పుట్టడం ఖాయం. పైగా మెడ ప్రాంతంలో సున్నితమైన రక్తనాళాలు ఉంటాయి. వీటి మీద ఏదైనా ఒత్తిడి పడితే.. అది మొత్తంగా మన దేహం మీద ప్రభావం చూపుతుంది. మెడ నొప్పులు.. దృష్టి సంబంధిత సమస్యలు.. తల సంబంధిత సమస్యలు అనేకం వస్తూ ఉంటాయి.

మన దేహంలో అత్యంత సున్నితమైన రక్తనాళాలు ఉండే ప్రాంతం మెడ. దీనిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది. అందువల్ల నేటి కాలంలో ఫోన్ చూడటం కూడా చాలా వరకు తగ్గించాలని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే అదేపనిగా ఫోన్ చూస్తే మెడ నరాల మీద ఒత్తిడి పడుతుంది. ఫలితంగా నేత్ర సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఇక ఇటీవల కాలంలో మెడలకు పట్టుకొని చాలామంది ఆ నొప్పుల నుంచి శాంతి పొందుతున్నారు..

కానీ ఓ వీడియోలో మాత్రం ఓ వ్యక్తి తనది కోడి మెడ అయినట్టు.. జిరాఫీకి తన దగ్గర సంబంధం ఉంది.. మెడను అమాంతం 180 డిగ్రీలు తిప్పాడు. అదేదో సినిమాలో రోబో గనుక తన తలను 100 వంకర్లు తిప్పినట్టు తిప్పేశాడు. వాళ్లకు వీడెవడు పిచ్చోడా.. మెడ ఏమైనా బబుల్గం అనుకున్నాడా.. అలా తిప్పేస్తున్నాడు.. నరాలు విరిగిపోతే.. ఆ ప్రభావం శరీరం మీద పడితే ఎలా బతుకుతాడు అన్నట్టుగా చూశారు.

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. కాకపోతే ఆ యువకుడు ప్రయాణిస్తున్న బండి నేమ్ ప్లేట్ వెనక యూపీ యువకుడు రిజిస్టర్ అయినట్టు చూపించాడు. ఎంత యూపి అయితే మాత్రం.. తల అలా వంకర్లు తిప్పాలా.. యోగాసనాలు వేసేవాళ్లు చాలా జాగ్రత్తగా శరీర అవయవాలను తిప్పుతారు. అది కూడా యోగ ప్రక్రియలో భాగంగానే. కేవలం యోగా చేస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళు శరీరాన్ని విల్లులాగా వంచుతారు. కానీ ఇతడు మెడను మాత్రం 108 డిగ్రీలు తిప్పేశాడు.. వాస్తవానికి అతనికి ఎంతో ప్రాక్టీస్ ఉంది. ఇటువంటి స్టంట్స్ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే ఒక్కోసారి పరిస్థితి అదుపు తప్పితే చేయడానికి కూడా ఏమీ.. ఇతను కూడా తన మెడ విషయంలో కాస్త జాగ్రత్త పాటిస్తే మంచిది. సోషల్ మీడియాలో హైప్ కోసం.. సెలబ్రిటీ కావాలనే తాపత్రయం. కానీ సోషల్ మీడియా అనేది ఒక బూటకం. అందులో కనిపించే వాళ్లంతా నిజమైన వ్యక్తులు కాదు. పాపం ఈ యువకుడికి ఎవరైనా అర్థమయ్యేలా చెప్తే బాగుండేది.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird