Home Latest News లారీ ఆపలేదని.. రక్తం వచ్చేలా కొట్టాడు.. వీడియో వైరల్! – Andhra Waves

లారీ ఆపలేదని.. రక్తం వచ్చేలా కొట్టాడు.. వీడియో వైరల్! – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖ : ఓ లారీ డ్రైవర్ పై వ్యక్తి పిడిగుద్దులతో దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లారీ ఎక్కి మరి విచక్షణారహితంగా కొట్టడంతో డ్రైవర్ తీవ్ర రక్తస్రావంతో ఏడుస్తున్న వీడియో బయటకు వచ్చింది. అయితే అలా కొడుతున్నది రవాణా శాఖకు చెందిన సిబ్బంది. విశాఖలో వెలుగు చూసిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాఖలోని జ్ఞానాపురం లారీ యార్డు దగ్గర లారీ డ్రైవర్ […]

ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖ : ఓ లారీ డ్రైవర్ పై వ్యక్తి పిడిగుద్దులతో దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లారీ ఎక్కి మరి విచక్షణారహితంగా కొట్టడంతో డ్రైవర్ తీవ్ర రక్తస్రావంతో ఏడుస్తున్న వీడియో బయటకు వచ్చింది. అయితే అలా కొడుతున్నది రవాణా శాఖకు చెందిన సిబ్బంది. విశాఖలో వెలుగు చూసిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాఖలోని జ్ఞానాపురం లారీ యార్డు దగ్గర లారీ డ్రైవర్ వాహనం నిలపలేదని.. డ్రైవర్‌ని బ్రేక్ ఇన్‌స్పెక్టర్ పార్వతి కారు డ్రైవర్ శతక బాదడం కనిపించింది. ఇదంతా బ్రేక్ ఇన్‌స్పెక్టర్ పార్వతీ సమక్షంలోనే జరిగింది. కేవలం లారీ ఆపలేదు అన్న తప్పిదాన్ని పట్టుకొని విచక్షణారహితంగా కొట్టడంతో ఆ లారీ డ్రైవర్ తీవ్ర రక్తస్రావంతో గాయాలకు గురయ్యాడు.

* అధికారుల తీరుపై విమర్శలు..
అయితే రవాణా శాఖ సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం లారీ ఆపలేదన్న తప్పిదాన్ని చూసుకొని విచక్షణారహితంగా కొట్టడం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. ఈ ఘటనతో లారీ డ్రైవర్లు ఒక్కసారిగా ఆందోళనకు సిద్ధమయ్యారు. రవాణా శాఖ అధికారులు తిరుపతి నిరసన వ్యక్తం చేశారు. లారీ డ్రైవర్ నోటి నుంచి రక్తం వచ్చేలా కొట్టడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.. ఈ దృశ్యాలను చూసిన రవాణా శాఖ అధికారులు వెంటనే స్పందించారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ పార్వతిని వెంటనే విజయవాడ కార్యాలయానికి అటాచ్ చేశారు. మరోవైపు లారీ డ్రైవర్ల అసోసియేషన్ బాధితులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.

* ఎక్కడికక్కడే తిరుగుబాటు..
ఇటీవల రవాణా శాఖకు సంబంధించిన అధికారుల తీరుపై ఎక్కడికక్కడే వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో సైతం అధికారుల తీరుతో విసిగిపోయిన లారీ డ్రైవర్లు.. అంతే దూకుడుగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల.. సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వివిధ నిబంధనలు, ధ్రువపత్రాల పేరుతో లారీ డ్రైవర్లకు ఇబ్బంది పెడుతుండడంతో వారు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. సహనం నశించి తిరుగుబాటు చేస్తున్నారు. అయితే విశాఖలో ఏకంగా లారీ లోపలికి వెళ్లి డ్రైవర్ పై విచక్షణారహితంగా దాడి చేయడం.. హాట్ టాపిక్ అవుతోంది.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird