Home ఆంధ్రప్రదేశ్ Crazy kalyanam trailer review: కామెడీ సరే.. కథ ఏది.. – Andhra Waves

Crazy kalyanam trailer review: కామెడీ సరే.. కథ ఏది.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


క్రేజీ కళ్యాణం ట్రైలర్ రివ్యూ: ఒకవైపు అనుపమ పరమేశ్వరన్ .. మరోవైపు తరుణ్ భాస్కర్.. మధ్యలో పెళ్లి.. తెలంగాణ యాస.. దీనికి తోడు సీనియర్ హీరో నరేష్ వెర్సటాలిటీ.. ఇవన్నీ కలబోత క్రేజీ కల్యాణం(క్రేజీ కళ్యాణం ట్రైలర్ సమీక్ష). ట్రైలర్ విడుదలైంది. ప్రారంభం నుంచి చివరిదాకా ఒక్కటే హడావిడి. కానీ ఒక్కటి మిస్ అయింది పుష్పా..

సాంప్రదాయ కుటుంబాలలో పెళ్లి అంటే ఒక రకమైన సందడి. బంధువులు చేసే హడావిడి.. గొడవలు ఉంటాయి.. అలకలు ఉంటాయి. ప్రేమలుంటాయి. చిన్న చిన్న పంతాలు కూడా కనిపిస్తుంటాయి. వీటికి కామెడీని జోడించి క్రేజీ కళ్యాణం అనే సినిమాను తీసుకొచ్చారు. నిజానికి ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులకు కొత్త కాదు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలు పెడితే ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఇటువంటి పేదలతో చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ఇప్పటివిటికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఉంటే సినిమా బాగుంటుంది. లేకుంటే అస్సాం వెళ్తుంది.

కథ ఏంటంటే

తన కుమార్తె పరిణయం అహో ఓహో అన్నట్టుగానేది ఆ తండ్రి తలంపు. కానీ కూతురు మాత్రం ఇష్టపడదు. తనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. జీవితం మీద అంచనాలు ఉంటాయి. దీనికి తోడు ప్రేమ వ్యవహారాలు.. అల్లుళ్ల మధ్య పోలికలు.. కుటుంబ సభ్యుల పంటలు.. ఇవన్నీ కలిసి పెళ్లి వేడుకను ఒక రకమైన గందరగోళంగా మార్చేశాయి.

ఇక ఈ కథలో కుటుంబ పెద్దగా నరేష్ కనిపించాడు. తరుణ్ భాస్కర్ విభిన్నమైన ప్రవర్తనతో కామెడీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపించాడు. అనుపమ కెరియర్ మీద స్పష్టమైన ఆలోచనలు ఉన్న యువత లాగా కనిపించింది. ఆమె లైఫ్ లోకి అఖిల్ రాజ్ వచ్చిన తర్వాత సినిమాలో ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే వీరిద్దరికీ పెళ్లి జరుగుతుందా.. మీరు ప్రేమ గెలుస్తుందా.. అనేది సినిమాలో చూడాలని దర్శకుడు చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు.

హైలెట్స్ ఇవే

తరుణ్ భాస్కర్ కామెడీ

తరుణ్ భాస్కర్ కల్పించే పాత్ర చాలా భిన్నంగా ఉంది. కుటుంబంలో అతడు గందరగోళం సృష్టించే వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు. తనదైన మేనరిజం చూపిస్తున్నాడు. ఒక రకంగా అతడు నవ్వులు పండించడానికి ప్రయత్నించినట్లుగా.

అనుపమా పరమేశ్వరన్

ఈమె తెలంగాణ యాసలో మాట్లాడింది. ఇది ప్రత్యేక ఆకర్షణ. తనకు నచ్చిన జీవితాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించే యువతి లాగా ఆమె ఏర్పడింది.

సీనియర్ యాక్టర్ నరేష్

కూతురు పెళ్లి విషయంలో ఒక తండ్రి పడే వేదన.. కుటుంబ సభ్యుల మధ్య పోటీ.. ఇతర వ్యవహారాలను పర్యవేక్షించే వ్యక్తిగా ఈయన కనిపించాడు.

సాంకేతిక బృందం ఎలా ఉందంటే

ఈ సినిమాకి భద్రప్ప గాజుల దర్శకత్వం వహించారు. బొబ్బిలి సురేష్ సంగీతం అందించారు. దుపాటి శ్యామ్ సినిమాటోగ్రఫీ.. శ్రవణ్ ఎడిటింగ్ చేశారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో పెళ్లి వేడుకలు.. కుటుంబ నేపథ్యం.. హాస్యం అంటి సన్నివేశాలను తెరమీద ఆవిష్కరించారు.

ప్లస్ పాయింట్లు

  • వెళ్లి వినోదం ఉంది.
  • తరుణ్ భాస్కర్.. అనుపమ డిఫరెంట్ పాత్రలో కనిపించారు.
  • కామెడీ తో పాటు కుటుంబ పెద్దగా నరేష్ కనిపించారు.
  • ఈ సినిమాల్లో భావోద్వేగాలకు పెద్దపేట వేసినట్టు.

మైనస్ పాయింట్లు

  • పెళ్లి నేపథ్యంలో ఇటువంటి సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి.
  • కథ కొత్తగా లేకపోతే అంతే సంగతులు.
  • ట్రైలర్‌లో పూర్తిగా హాస్యం మాత్రమే కనిపించింది.
  • ప్రేమ కథ.. కుటుంబ కథ మధ్య ఈక్వాలిటీ ఉండాలి. ట్రైలర్ లో ఇది కనిపించలేదు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird