డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీపీఆర్వో గా పనిచేస్తున్న మారబోయిన మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో పనిచేసిన మధు ప్రజా సంబంధాల అధికారిగాను రాణించారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం ఛాతి నొప్పితో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కార్డియాక్ అరెస్టు కావడంతో సమీపంలోని అపోలో ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో మరోసారి కార్డియాక్ అరెస్ట్ రావడంతో ఆయన కన్నుమూశారు. మధుసూదన్‌కి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో సీనియర్ జర్నలిస్టుగా ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. నికార్సైన, నిజాయితీ గల పాత్రికేయుడిగా ఆయనకు మంచి పేరు ఉంది.
