Home Latest News హైదరాబాద్‌లో భారీ క్రేన్ కూలి నలుగురు మృతి | హైదరాబాద్ లో భారీ క్రేన్ కూలి ముగ్గురు మృతి | NCC నిర్మాణ సంస్థ | సీఎం రేవంత్ రెడ్డి | తెలంగాణ ప్రభుత్వం | సీపీ సజ్జనార్ – Andhra Waves

హైదరాబాద్‌లో భారీ క్రేన్ కూలి నలుగురు మృతి | హైదరాబాద్ లో భారీ క్రేన్ కూలి ముగ్గురు మృతి | NCC నిర్మాణ సంస్థ | సీఎం రేవంత్ రెడ్డి | తెలంగాణ ప్రభుత్వం | సీపీ సజ్జనార్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


హైదరాబాద్ నగర సమీపంలోని శంకర్‌పల్లి ప్రాంతంలో సోమవారం సాయంత్రం విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఎన్‌సీసీ నిర్మాణ సంస్థకు చెందిన నిర్మాణ స్థలంలో పనిచేస్తున్న భారీ క్రేన్ ఒక్కసారిగా కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

సాక్షుల కథనం ప్రకారం ఈరోజు సోమవారం సాయంత్రం ఒక్కసారిగా గాలి, వర్షం తీవ్రంగా ఉండగా భారీ క్రేన్ సడన్‌గా నియంత్రణ కోల్పోయి నేలపై పడిపో యింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు లపై క్రేన్ శిఖరాలు పడటం తో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో పది మందికి తీవ్ర గాయాలు కాగా వారిని వెంటనే లలిత హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. గాయపడిన వారిపై వైద్యులు నిఘా ఉంచినట్లు సమాచారం.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో నిర్మాణ ప్రదేశంలో మొత్తం 13 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. క్రేన్ శిథిలాల కింద ఇంకా మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్రేన్ శకలాలను తొలగించే ప్రక్రియను తొలగించారు. మృతులు మరియు గాయాలైన కార్మికులు బీహార్, చత్తీస్‌గడ్, అస్సాం కు చెందిన వారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కార్మికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. అధికారులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird