వర్మను పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ అనే పదవి నుంచి తొలగించడం వెనక గల కారణం అంటే చంద్రబాబుకు కూటమి ఎంత కలసికట్టుగా ఉంటే మనం అంత బలంగా ఉండగలం అన్నది బాగా తెలుసు. ఇది వరకు చంద్రబాబు ఇలా ఉండేవారు కాదు. ఇలాంటి సున్నితాంశాలకు పెద్దగా విలువనిచ్చేవారు కాదు. ఈ విషయంపై సాధారణ కార్యకర్తలకు కూడా ఒక ఐడియా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వారు అనుభవిస్తున్నది అదే కాబట్టి.. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు కూడా లేవు.
బాబుని ఎందుకంత విలువైనదిగా కూటమి కోరుకుంటున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడు చీలిపోతుందని కాచుకుని కూర్చుంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే క’నిపించాడు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజయ్యని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
ప్రస్తుతం వైసీపీ నేతలకు వర్మ రూపంలో మరో లడ్డూ దొరికింది. వచ్చే ఎన్నికల్లో వర్మగానీ పిఠాపురంలో ఇండిఎండెంట్‌గా నిలబడితే చాలు.. పవన్ కళ్యాణ్ కి డిపాజిట్లు రావని రెచ్చగొట్టుడు కామెంట్లు చేస్తున్నారు. దానికి తోడు పక్క రాష్ట్రం విజయ్ వ్యవహారం ఉండనే ఉంది. విజయ్ ఒంటరిగా నిలబడి గెలిచాడని.. అదే పవన్ కళ్యాణ్ కి అది సాధ్యం కావడం లేదని కావాలనే ఊదరగా చేస్తున్నారు మరోపగొట్టక్క. ఇదే టైంలో వర్మను పిఠాపురం ఛార్జి బాధ్యతల నుంచి తప్పించడంతో.. ఇపుడు ఫ్యాను గాలి ఇటు మళ్లింది. ఇక దంచి కొట్టుడు మొదలు పెట్టారు.
ఇక వైసీపీ ఇన్ ఫ్లూయెన్షర్లలో కొందరు అనే మాట ఏంటంటే కూటమి నుంచి పవన్ ని అయినా వెళ్లగొట్టండి లేదా కొత్త కాపునాయకత్వమైనా వైసీపీలోకి వచ్చేలా చేయండని తెగ సలహాలు ఇస్తున్నారు. అదృష్టమో, దురదృష్టమో.. రంగా తర్వాత అంతటి కాపు టవరింగ్ పర్సనాల్టీ పవన్ కళ్యాణ్ గానే చెప్పాలి. ఆయన కాకుండా కనుచూపు మేరలో కూడా ఎవ్వరూ అలాంటి వారు లేనే లేరు.
అందుకే విధిలేని పరిస్థితుల్లో జగన్ తమ పార్టీలోని కాపు నాయకుడు అంబటి రాంబాబును హైలైట్ చేస్తున్నారు. కాపు టైగర్ అనే బిరుదులివ్వడంతో పాటు కాపు నాయకత్వం ఏకం చేసి.. వారిలో ఒక చైతన్యం తీసుకొచ్చేందుకు తీవ్ర యత్నాలు సాగిస్తున్నారు. దురదృష్టమేంటంటే, కాపు టైగర్ బిరుదాంకితుడైన అంబటికి అసలు కాపు కులమంటేనే గిట్టదు.. కమ్మలను ఇరవై నాలుగు గంటలు ఆడిపోసుకునే ఆయన తన ముగ్గురు అల్లుళ్లనూ కమ్మలనే చేసుకోవడం ఇందులో కొసమెరుపు.
ఎటు నుంచి ఎటు చూసినా.. జగన్ కి కూటమిని చీల్చడం ఎలాగో పాలు పోక, తన పార్టీలోనే కాపు టైగర్ ని ఎలా తయారు చేయాలో తెలీక.. నానా తంటాలు పడుతున్నారు. సరే ఇదంతా ఇలా ఉంటే కూటమి నానాటికీ అలర్ట్ అయ్యి.. తమ పొత్తుకు ఎవరు విఘతం కలిగిస్తున్నారో వారిని పక్కగా గుర్తించి ఏరిపారేస్తుండటం.. దిక్కుతోచని పరిస్థితిలో పడుతోంది పాపం వైసీపీ అధిష్టానం. ఏ మాట’కామాట ఈ కష్టం ప’గ’వాడికి కూడా రాకూడ’దు. అంత’గా విల’విలలాడిపోతోంది. వైసీపీ యంత్రాంగమంతా.
